తాటిచెట్టుకు కట్టిన వెదురు బొంగులు
ఇప్పటివరకు బొంగులో చికెన్ విన్నాం. కానీ బొంగులో కల్లు పేరు విన్నారా?! సాధారణంగా తాటిచెట్టుకు మట్టి కుండలు కట్టి కల్లు నిండాక కిందకు దించుతారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కో చెట్టుకు పదుల సంఖ్యలో వెదురు బొంగులు పెట్టారు. చెట్టు నుంచి వచ్చే కల్లు ఈ బొంగుల్లోకి చేరాక కిందకు దించుతారు. మట్టి కుండలతో పోలిస్తే వెదురు బొంగుల్లోని కల్లు రుచి విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఇలా బొంగులు కట్టిన తాటి చెట్టు కనిపించింది.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం
చదవండి👉 కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙
Comments
Please login to add a commentAdd a comment