గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ ముందస్తు జాగ్రత్తగా వినూత్న నిర్ణయం తీసుకుంది. నిండు గర్భిణులు వానల, వరదల కారణంగా ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ప్రసవానికి ఇంకా వారం గడువున్న గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలిస్తోంది.
అంతేకాకుండా వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. దాదాపుగా 10వేల మంది గర్భిణులను తరలించి ముందస్తు సేవలు అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రత్యేక వాహనం తో పాటు అన్నీ సిద్ధం చేసినట్టు కూ యాప్ వేదికగా వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment