సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్‌చార్జి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌గా ఉన్న పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో వైఎస్ చైర్మన్‌గా ఉన్న లింబాద్రికి ఈ బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రి బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన చైర్మన్ పదవిలో కొనసాగుతారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్
చదవండి: ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్
తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి
Published Tue, Aug 24 2021 7:15 PM | Last Updated on Tue, Aug 24 2021 7:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment