తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావం
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, కర్ణాటక, తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో అత్యధికంగా 40.5 డిగ్రీ సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో అత్యధికంగా 24.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఈనెల 14 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని ఆ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment