సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. రాజాసింగ్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా..
ఇదిలా ఉండగా మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. మంగళవారం ఒక్కరోజే ఈ బీజేపీ ఎమ్మెల్యేపై 12 కేసులు నమోదవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment