KPHB: కేపీహెచ్బీలో కారు బీభత్సం.. మాజీ మంత్రి మేనల్లుడు.. | Road Accident In KPHB at Hyderabad | Sakshi
Sakshi News home page

KPHB: కేపీహెచ్బీలో కారు బీభత్సం.. మద్యం మత్తులో మాజీ మంత్రి మేనల్లుడు..

Published Mon, Jan 8 2024 8:50 AM | Last Updated on Mon, Jan 8 2024 9:23 PM

Road Accident In KPHB at Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: కూకట్​పల్లిలోని కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్‌ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి మేనల్లుడు మద్యం మత్తులో కారు నడిపి.. ఓ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తు‍న్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా‍యి. 

వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీలో మాజీ మంత్రి మేనల్లుడు అగ్రజ్‌ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. నలుగురు స్నేహితులతో సోమవారం తెల్లవారుజాము వరకు ఫుల్లుగా మద్యం సేవించి కారును డ్రైవ్‌ చేశారు. ఈ క్రమంలో రాంగ్‌ రూట్‌లో కారును నడిపి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టారు. అగ్రజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు బ్రిత్ అనలైజ్ పరీక్ష చేశారు అందులో ఆల్కహాల్ 90% సేవించినట్టు వచ్చింది. 

దీంతో, బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement