
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. అతి వేగంగా వస్తున్న నిసాన్ కారు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు రాగానే పల్టీ కొట్టడంతో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచుకుంది. కారులో ఉన్న వారంత స్వల్ప గాయాలతో భయటపడ్డారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసలు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు.
కారు ప్రమాదంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాహనాల నడిపే చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని ప్రాథమిక సమాచారం. (హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. హైకోర్టు ఉద్యోగి మృతి)
Comments
Please login to add a commentAdd a comment