Peddapalli Road Accident: 7 Year Old Boy Dies After Being Hit By Toofan - Sakshi
Sakshi News home page

ఆ తల్లిని ఓదార్చడం ఎవరితరము కాలే!

Published Mon, Mar 1 2021 8:40 AM | Last Updated on Mon, Mar 1 2021 2:02 PM

Road Accident In Peddapalli Boy Dies After Being Hit By Tufan - Sakshi

వెల్గటూరు(ధర్మపురి): ఓ డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగం చిన్నారి ప్రాణాలను బలిగొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన దాసరి హరీశ్‌(7) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎస్సై ప్రేమ్‌కుమార్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి పోచయ్య–సత్తమ్మకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు హరీశ్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. స్కూలు లేక పోవటం వల్ల హరీశ్‌ అతడి పెద్దనాన్న కొడుకు ఇద్దరూ తాతతో కలిసి గ్రామ శివారులో మేకల వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో ఎండ బాగా కొడుతుందని, ఇంటికి వెళ్లండని తాత చెప్పడంతో ఇద్దరూ ఇంటికి బయలు దేరారు.

గ్రామంలోని వరంగల్‌–రాయపట్నం హైవే రోడ్డుదాటే క్రమంలో ధర్మారం నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న ఏపీ01ఎక్స్‌3483 నంబర్‌ గల తూఫాన్‌ వాహనం హరీశ్‌ను వేగంగా ఢీకొట్టంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటన స్థలానికి చేరుకొని కొడుకు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

చదవండి: ప్రాంక్‌ వీడియో: బాలికలతో అసభ్య ప్రవర్తన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement