సాక్షి నెట్‌వర్క్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో రహదారులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం నుంచి పండుగ సెలవులు ప్రారంభమవుతుండగా గురువారం సాయంత్రం నుంచే ఊళ్లకు వెళ్తున్న వారితో రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయి.
హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు పరుగులు తీస్తున్నాయి. పంతంగి టోల్‌గేట్ వద్ద కార్లు బారులు తీరాయి. ప్రమాదాలు చోటుచేసుకోకుండా, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు నిరంతరం పరిశీలిస్తూ వాహనదారులకు సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment