గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్‌  | RTC Greater Hyderabad Zone Offers Tea, Coffee, Snacks For Travelers | Sakshi
Sakshi News home page

గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్‌ 

Published Sun, Mar 6 2022 3:31 PM | Last Updated on Sun, Mar 6 2022 8:39 PM

RTC Greater Hyderabad Zone Offers Tea, Coffee, Snacks For Travelers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌  ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గరుడ, రాజధాని బస్సుల కోసం బస్‌స్టేషన్‌లలో ఎదురు చూసే ప్రయాణికులకు సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ, టీ, స్నాక్స్, తాగునీరు అందజేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మియాపూర్‌ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, టెలిఫోన్‌ భవన్, కాచిగూడ, ఎల్బీనగర్‌ డిమార్ట్‌ ఎదురుగా చింతలకుంట పల్లవి గార్డెన్స్‌ తదితర బస్టాపులలో ఈ సదుపాయం ఉంటుంది.   

చదవండి: (తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement