long distance travel
-
దూరప్రాంతాలకు కొత్తగా వెయ్యి బస్సులు
గన్నవరం: ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతో పాటు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కృష్ణాజిల్లా గన్నవరం ఆర్టీసీ బస్టాండ్, డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి ఆర్టీసీ సర్వీస్‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపోను పరిశీలించిన ఎండీ, బస్సుల కండీషన్‌పై గ్యారేజ్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ సర్వీస్‌ల ఆదాయంతోపాటు, కమర్షియల్ ఆదాయం పెంచే దిశగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు గతంలో 15 ఏళ్లకు ఆర్టీసీ స్థలాలు లీజుకు ఇచ్చినప్పటికీ సరైన స్పందన రాలేదని, ఈ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంస్థ కొత్తగా కొనుగోలు చేసిన వెయ్యి డీజిల్ బస్సులు వస్తుండటం వల్ల దూర ప్రాంత సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉందన్నారు. పాత ఎక్స్‌ప్రెస్ బస్సులను పల్లె వెలుగు బస్సులుగా మార్పులు చేసి గ్రామీణ సర్వీస్‌లకు ఉపయోగిస్తామని చెప్పారు. అద్దె బస్సులను కూడా బ్రాండ్ న్యూ కింద కొత్తగా తీసుకున్నామని వివరించారు. ఇటీవల మహాశివరాత్రి, సంక్రాంతి, శబరిమలకు నడిపిన సర్వీస్‌ల వల్ల ఆర్టీసీ ఆదాయం పెరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్ధం దేవాలయాల సందర్శన ప్రత్యేక సర్వీస్‌లను కూడా పెంచామని చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెల 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని, పీఎఫ్ ట్రస్ట్‌ను కూడా బలోపేతం చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సంస్థ అప్పులు కూడా చాలావరకు తీర్చివేసినట్లు తెలిపారు. గన్నవరం బస్టాండ్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. డిపో మేనేజర్ పి. శివాజీ నేతృత్వంలో సిబ్బంది ఎండీకి ఘన స్వాగతం పలికారు. -
గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్
సాక్షి, హైదరాబాద్: నగరం నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గరుడ, రాజధాని బస్సుల కోసం బస్స్టేషన్లలో ఎదురు చూసే ప్రయాణికులకు సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ, టీ, స్నాక్స్, తాగునీరు అందజేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మియాపూర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, టెలిఫోన్ భవన్, కాచిగూడ, ఎల్బీనగర్ డిమార్ట్ ఎదురుగా చింతలకుంట పల్లవి గార్డెన్స్ తదితర బస్టాపులలో ఈ సదుపాయం ఉంటుంది. చదవండి: (తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!) -
గుడ్‌న్యూస్: సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
TSRTC Offers To Travelers: దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఫ్రీగా ప్రయాణించే గొప్ప అవకాశం టీఎస్ ఆర్టీసీ కల్పించిందని భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విశాఖపట్టణం, కాకినాడ, భద్రాచలం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు, 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చన్నారు. ముందుగా బుక్ చేసుకున్న బస్సు బయలుదేరే టైం వరకు రెండు గంటల ముందు నగరంలో ఏ ప్రాంతం నుంచైనా బస్సు ఉన్న చోటుకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్‌ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు వచ్చే ప్రయాణికులకు కూడా వారు షెడ్యూల్డ్ టైం నుంచి 2 గంటలలోపు వారి గమ్యస్థానాలకు చేరుకునే వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. టీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చదవండి: (నిలోఫర్‌లో ఇద్దరు చిన్నారుల మృతి? ఉద్రిక్తత) -
నిప్పంటుకుంటే అంతే..
సాక్షి, గన్నేరువరం (కరీంనగర్): వేసవికాలంలో ప్రారంభమైంది. ఈ ఏడాది నిప్పు కొలిమిలా ఎండలు ఉంటాయని ప్రభుత్వం, అధికారులు ముందస్తు ప్రకటనల్లో పేర్కొంటున్నారు. ఏమాత్రం ఏమారుపాటు ఉన్న అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. రానున్న రోజుల్లో ఏప్రిల్, మేనెలల్లో ఎండల తీవ్రత అధిక ఉంటుంది. ఈ సమయాల్లోనూ వరికోతలు ప్రారంభమై ధాన్యం, గడ్డివాములు తరలింపులు ఉంటాయి. అలాగే కొన్నిచోట్ల రహదారుల పక్కనే గడ్డవాములను రైతులు ఏర్పాటు చేసుకుంటారు. రైతులు, వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించడానికి వివిధ ప్రాంతాలకు వాహనాల్లో వాటిని తరలిస్తుంటారు. అంతేకాకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనుకొని ప్రమాదాలు చోటుచేసుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సందార్భాల్లో రైతులకు, ప్రజలకు, వ్యాపారులకు అపార నష్టం జరుగుతుంది. అందుబాటులో ఫైర్ ఇంజిన్లు లేకపోవడంతో పాటు అందుబాటులో నీటివసతి లేక అగ్నిప్రమాదాలను అరికట్టానికి బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు మండలంలోని గుండ్లపల్లి స్టేజీ రాజీవ్ రహదారి పక్కన గల ఎస్బీఐలో 2014లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని నివారించేందుకు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. కాని అక్కడి నుంచి ఇక్కడికి ఫైర్ఇంజిన్ వచ్చేవరకూ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొంత సమయానికి ముందుగా వచ్చిఉంటే నష్టం తగ్గి ఉండేందని స్థానికులు పేర్కొంటున్నారు. ఖాసీంపేటలో ఒక రైతు ట్రాక్టర్లో గడ్డివాముతో వ్యవసాయ బావి వద్దకు తీసుకువస్తుండగా విద్యుత్ లూజ్‌లైన్ల కారణంగా వైర్లు ట్రాక్టర్‌పై ఉన్న గడ్డివాముకు తగిలి మంటలు అంటుకున్నాయి. దగ్గరలో ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో కాపాడే పరిస్థితి లేకపోయింది. 2017 ఏప్రిల్‌లో జంగపల్లి గ్రామం గుట్టపై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ప్రారంభమైన సమయంలో ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించారు. కరీంనగర్లో అందుబాటు లేక రాజన్నా సిరిసిల్లా జిల్లా నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చింది. కాని అప్పటికే నష్టం జరిగిపోయింది. ఈ గుట్టపై జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వేలమొక్కలు నాటారు. ఈ ప్రమాదంలో మొక్కలు మొత్తం మంటలకు బుడిదైపోయాయి. ఇలా మండలంలో ఏడాది పొడవునా అనేక అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడల్లా కరీంనగర్, సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల కేంద్రాల్లోని అగ్ని మాపకకేంద్రాలకు ఫోన్‌చేస్తే ఫైర్ ఇంజిన్ రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి వచ్చే సరికి ప్రమాదం స్థాయి పెరిగి భారీనష్టం చోటు చేసుకుంటుంది. అయితే రాజీవ్ రహదారి పక్కనే ఉన్న గన్నేరువరం మండలంలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రజలు, పాలకులు డిమాండ్ చేస్తున్నా నేటికి అది నేరవేరడం లేదు. అగ్ని మాపక కేంద్రాన్ని మంజూరు చేయాలి మండలంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇటు కరీంనగర్ అటు సిద్దిపేట. రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి రావాల్సి ఉంటుంది. ఏటుచూసిన మండలకేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గన్నేరువరం మండలం మెట్టప్రాంతం కావడంతో ఎక్కువ స్థాయిలో పశుగ్రాసాలకు అగ్ని ప్రమాదాలు జరుగుతుంటా యి. ఈ ప్రమాదాలు జరిగాయంటే క్షణాల్లో బుడిదవుతున్నాయి. ఇళ్లల్లో పత్తి సైతం మం టల్లో కాలిపోలినా ఘటనలు అనేకం ఉన్నాయి. మండలకేంద్రంలో ఇటీవల ఒక పూరిగుడిసెకు మంటలంటుకుని దగ్ధమైంది. ఇందు లో రూ.30వేల నగదుతో పాటు దుస్తువులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గతేడాది మండలకేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు సంభవించి 5 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. 40 కిలోమీటర్ల దూరం నుంచి ఫైర్ ఇంజిన్లు రావడం అలస్యమవుతుండడంతో వచ్చేలోపు పెద్ద ఎత్తున నష్టం చవిచూడాల్సి వ స్తుందని ప్రజలు వాపోతున్నారు. మండలంలోని పత్తి రైతులు తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామ శివారులోని పత్తి జిన్నింగ్ మిల్లుకు పత్తిని రైతులు తీసుకెళ్తుంటారు. అనుకొని పరిస్థితుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ చేరుకోవడంలో అలస్యమైతే భారీనష్టాలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. మండలంలోని రాజీవ్ రహదారి సమీప గ్రామం గుండ్లపల్లి స్టేజీ కేంద్రంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఇటు బెజ్జంకి, ఇల్లంతకుంట అటు కోహెడ మండలాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మండలకేంద్రానికి అగ్ని మాపక కేం ద్రాన్ని మంజూరు చేయాలని కోరుతున్నారు. -
నాన్ స్టాప్ విమానాలు వచ్చేస్తున్నాయ్
సింగపూర్ : నాన్-స్టాప్ బస్సులు, రైళ్లే కాదు ఇక మీదట నాన్-స్టాప్ విమానాలు రానున్నాయి. అవును ప్రపంచంలోనే తొలి నాన్-స్టాప్ విమానాన్ని ప్రారంభించనున్నట్లు సింగపూర్ విమానయాన సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ విమానం ఏకధాటిగా 20 గంటల పాటు గాలిలోనే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. సింగపూర్ విమానయాన సంస్థ నూతనంగా ప్రారంభించబోయే ‘ఎయిర్‌బస్ ఏ350 - 900 యూఎల్ఆర్’(అల్ట్రా లాంగ్ రేంజ్) విమానం ఈ ఘనతను సాధించబోతుందని పేర్కొన్నారు. ఈ విమానం సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకూ 20 గంటల పాటు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని గురువారం నాడు అధికారులు ప్రకటించారు. గతంలో 9 వేల మైళ్ల దూరాన ఉన్న న్యూయార్క్ వెళ్లడానికి ఈ విమానయాన సంస్థ గ్యాస్‌తో నడిచే నాలుగు ఇంజిన్లు గల ‘ఏ340 - 500’ విమానాలను ఉపయోగించేది. అయితే ఈ విమానంలో కేవలం వంద బిజినెస్ క్లాస్ సీట్లు మాత్రమే ఉండేవి. అంతేకాక వీటి సేవలు కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో సింగపూర్ విమానయాన సంస్థ వీటిని 2013లో రద్దు చేసింది. ఈ ‘ఎయిర్‌బస్ ఏ340 - 500’ స్థానంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ‘ఎయిర్‌బస్ ఏ350 - 900’లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలాంటివి మొత్తం ఏడు అల్ట్రా లాంగ్ రెంజ్ విమానాల కొనుగోలుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏ350 - 900 విమానాన్ని ఈ నెల 23న దాదాపు ఐదు గంటల పాటు పరీక్షించిన అనంతరం ఫ్రాన్స్‌లోని టౌలాస్ విమానాశ్రయంలో లాండ్ చేశారు. వాస్తవానికి అల్ట్రా లాంగ్ రేంజ్ విమానాలు ఏకధాటిగా దాదాపు 11,160 మైళ్లే ప్రయాణిస్తాయని, కానీ ప్రస్తుతం రూపొందించిన ఏ350లో ఈ సామర్థ్యాన్ని మరో 1800 మైళ్లను పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత దూరం ఏకధాటిగా ప్రయాణించే విమానయాన సంస్థగా సింగపూర్ రికార్డు సృష్టించనుంది. ‘ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రూపొందించబోయే ఏ350 విమానాల్లో అనేక మార్పులు చేయనున్నాం. పాత విమనాల్లో క్యాబిన్ పొడవైన గొట్టం మాదిరిగా ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకురానున్న ఏ350 ఎయిర్‌బస్‌లలో క్యాబిన్ పూర్తిగా మార్చివేసి ఒక గదిలాగా డిజైన్ చేయనున్నాం. అంతేకాక విమానం లోపల అధునాతన ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థతో పాటు తక్కువ శబ్దం వచ్చేలా మార్పులు చేయనున్నాం’ అని ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫ్లారెంట్ పెటేని తెలిపారు. -
రైళ్లలో మరిన్ని ఆర్ఏసీ బెర్తులు!
దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్లు రిజర్వేషన్ చేయించుకుందామంటే వెయిటింగ్ లిస్టు లేదా ఆర్ఏసీ కనిపిస్తుంది. ఆర్ఏసీ అంటే ఎంతో కొంతవరకు బెర్తు కన్ఫర్మ్ అవుతుందనే ఆశ ఉంటుంది. లేకపోయినా.. ఎలాగోలా ప్రయాణం చేయొచ్చని భావిస్తారు. ఇప్పుడు అలాంటివాళ్ల కోసం రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది. మొత్తం అన్ని రైళ్లలోను ఆర్ఏసీ (రిజర్వేషన్ ఎగైనెస్ట్ కాన్సిలేషన్) కింద మరిన్ని బెర్తులను అందుబాటులోకి తేనుంది. స్లీపర్ బోగీలలో ప్రస్తుతం ఐదు ఆర్ఏసీ బెర్తులు మాత్రమే ఉండగా, దాన్ని ఏడుకు పెంచాలని నిర్ణయించింది. సాధారణంగా పూర్తిగా బెర్తు కన్ఫర్మ్ కాకుండా ఆర్ఏసీలోనే ఉండిపోతే.. మనకు కనీసం కూర్చోడానికి సీటు దొరుకుతుంది. ఇలా ఇన్నాళ్లూ ఐదు బెర్తులు అంటే.. పది మందికి సీట్లు ఇస్తుండగా, దాన్ని ఏడు బెర్తులకు.. అంటే 14 సీట్లకు పెంచారు. సైడ్ లోయర్ బెర్తులో ఎదురెదురుగా ఇద్దరి చొప్పున కూర్చోవచ్చు. ఈ నిర్ణయం 2017 జనవరి 16వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ఇక థర్డ్ ఏసీ బోగీలలో అయితే ఇప్పుడున్న రెండు బెర్తుల నుంచి నాలుగు బెర్తులకు ఆర్ఏసీ కోటా పెంచారు. అలాగే సెకండ్ ఏసీ బోగీలలో ఇప్పుడున్న రెండు నుంచి మూడు బెర్తులకు ఈ కోటా పెంచారు. కూర్చోడానికి మాత్రమే అవకాశం ఇచ్చినా, ఇందులో పూర్తి చార్జి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. మరింతమందికి రైలు ప్రయాణం అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్లు రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు.