న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శామ్ కోషీని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి తనను బదిలీ చేయాలంటూ జస్టిస్ కోషీ చేసిన విజ్ఞప్తిని కొలీజియం పరిగణనలోకి తీసుకుంది.
వాస్తవానికి మధ్యప్రదేశ్ హైకోర్టుకు పంపించాలని తొలుత భావించినప్పటికీ ఆయన అంగీకరించలేదు. మధ్యప్రదేశ్ మినహా మరో హైకోర్టుకు బదిలీ చేయాలని జస్టిస్ కోషీ విన్నవించడంతో తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment