ఆదిలాబాద్ జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. జిల్లా సరిహద్దులో పారుతున్న పెన్‌గంగ నుంచి అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో నదిలో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో ఏకంగా ప్రొక్లెయిన్‌తో నదిని తోడేస్తున్నారు.
నదిలోని నీటిపాయకు అడ్డుకట్ట వేసి ప్రవాహాన్ని మళ్లించి పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. జైనథ్, బేల మండలాల పరిధిలోని సాంగ్వి, అనంతపూర్, సాంగిడి, బెదోడ గ్రామాల శివారు నుంచి ఇసుక దోపిడీ జోరుగా సాగుతోంది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇసుక అక్రమ రవాణా వెనుక అధికారులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment