
కారేపల్లి: సెల్‌ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించినందుకు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని క్షణికావేశంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని పేరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పేరుపల్లి గ్రామానికి చెందిన బూడిద నరేశ్, ఉమారాణి దంపతుల కుమార్తె బూడిద మనీషా (15) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
కాగా.. ఇంటి వద్ద మనీషా సెల్‌ఫోన్‌లో తరుచుగా మాట్లాడుతుండటంతో తల్లి ఉమారాణి సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడొద్దని మందలించింది. దీంతో మనీషా క్షణికావేశానికి లోనై ఇంట్లో ఉన్న పురుగుమందు (గడ్డి మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా సోమవారం పరిస్థితి విషమించి మృతి చెందింది. తల్లి ఉమారాణి ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్‌ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment