సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రస్తుతానికి స్లాట్ బుక్ చేసుకుని పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మరి కొద్ది సేపట్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈనెల 14 నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. (చదవండి: వ్యవసాయేతర ‘రిజిస్ట్రేషన్లు’ షురూ..)
ఇక పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లకు ఏర్పాట్లు చేసినప్పటికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. స్లాట్ బుక్ చేసుకోవడంలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. స్లాట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ మొరాయిస్తుందని జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment