కేటీఆర్ సమక్షంలో ఎంవోయూ చేసుకుంటున్న ప్రీమియర్ ఎనర్జీ, ఆజూర్ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగంలో రాష్ట్రం కీలక ముందడు గువేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో 1.25 గిగావాట్ల సోలార్ సెల్స్, 1.25 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ (సౌర ఫలకలు) తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్, ఆజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ సంయుక్తంగా రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మెగా ప్రాజెక్టుల విభాగం కింద ఈ పరిశ్రమ కోసం మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ సిటీ (ఈ–సిటీ)కి 20 ఎకరాలను అదనంగా కేటాయించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
వచ్చే నాలుగేళ్లలో రూ. 4 వేల కోట్ల అంచనా విలువతో 2.4 గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్‌ను ఆజూర్ పవర్‌కు సరఫరా చేసేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ సోమవారం కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆజూర్ పవర్ పరిశ్రమ విస్తరణ ద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా, అనుబంధ పరిశ్రమల స్థాపనతో 2,000 మందికి పరో క్షంగా ఉపాధి లభించనుంది.
ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ద్వారా ఎలక్ట్రానిక్స్ సిటీలో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన సం స్థగా నిలవనుంది. దేశంలో సౌర విద్యుదుత్పత్తిని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రీమియర్, ఆజూర్ నుం చి పెట్టుబడులు పునరావృతం కావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నా రు. దీర్ఘకాలిక సరఫరా అవకాశాలు ఉండటంతో తమ పెట్టుబడులు సురక్షితమని నిర్ధారణకు వచ్చా మని ఆజూర్ పవర్ చైర్మన్ అలాన్ రోజ్లింగ్ తెలిపారు.
తనదైన ప్రత్యేక సాంకేతికతతో అధునాతన సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియర్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తోందని, ఆ సంస్థతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరమన్నారు. సోలార్ రంగం లో 27 ఏళ్ల అనుభవాన్ని తమ సంస్థ కలిగి ఉందని ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్‌పాల్ సింగ్ పేర్కొన్నారు. సోలార్ సెల్స్ కలయికతో ఏర్పడే ఫొటో వోల్టాయిక్ ప్యానెల్‌ను సోలార్ మాడ్యూల్ అంటారు. సూర్యకిరణాలను సంగ్రహించడం ద్వారా సోలార్ సెల్స్ విద్యుదుత్పత్తి చేయడం తెలిసిందే.
రూ. 250 కోట్లతో మెటా4 ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న యూఏఈకి చెందిన మెటా4 సంస్థ తెలంగాణలో రూ.250 కోట్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వోల్ట్‌లీ ఎనర్జీ కంపెనీ ద్వారా మెటా4 ఈ పెట్టుబడి పెడుతోంది. జహీరాబాద్ వద్ద 15 ఎకరాల్లో తయారీ కేంద్రం స్థా పించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదిరింది. 2023 మార్చి నాటికి తొలిదశ అందుబాటులోకి రానుంది. వార్షిక తయారీ సామర్థ్యం 40,000 యూనిట్లుకాగా.. మూడేళ్లలో లక్ష యూనిట్లకు పెంచనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment