
సాక్షి, హైదరాబాద్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దక్షిణమధ్య రైల్వేలో ఏర్పాటు చేసిన ‘ఆజాదీ కా రేల్ గాడీ ఔర్ స్టేషన్’ వేడుకలు సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో ప్రారంభమయ్యాయి. కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, వివిధ విభాగాలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 23వ తేదీ వరకు దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో ఆజాదీ కా రేల్ గాడీ ఔర్ స్టేషన్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్‌పీఎఫ్ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్త్సోత్సవాల స్ఫూర్తిని చాటుతూ కళాకారులు అద్భుతమైన కార్యక్రమాలతో అలరించారు.
(చదవండి: మహిళల కోసం ప్రత్యేక ‘లీగల్ సెల్’ )
Comments
Please login to add a commentAdd a comment