అదనపు కలెక్టర్ల ఆటాపాట.. | Spiritual Compound Of Government Officials In karimnagar | Sakshi
Sakshi News home page

ఆత్మీయ సమ్మేళనం: అదనపు కలెక్టర్ల ఆటాపాట..

Published Mon, Dec 21 2020 8:37 AM | Last Updated on Mon, Dec 21 2020 9:32 AM

Spiritual Compound Of Government Officials In karimnagar - Sakshi

కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్, జడ్పీ సీఈవో మాధవరావు ఆలింగనం 

సాక్షి, కరీంనగర్‌: వారిది 1995లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్‌ (పీడీటీ)ల బ్యాచ్‌. 25 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకేచోట కలిశారు. ఇంకెముందీ.. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ ఆడి పాడారు. ఉన్నతస్థానాల్లో ఉన్న వీరంతా ఆదివారం కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. వయసు, హోదా మర్చిపోయి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కరీంనగర్‌ అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ఆదిలాబాద్‌ అదనపు కలెక్టర్‌ డేవిడ్, నల్లగొండ అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్, జోగులాంబ గద్వాల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, సీనియర్‌ తహసీల్దార్‌ కుందారపు మహేశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పీఎస్‌ చంద్రమోహన్, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, స్పీకర్‌ ఓఎస్డీ మోహన్‌రెడ్డి, ల్యాండ్స్‌షిప్‌ ఫెడరేషన్‌ ఓఎస్డీ లక్ష్మీ కిరణ్, కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ శశిధరచారి, రెవెన్యూ వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌ పూర్ణచంద్ర పాల్గొన్నారు.


అధికారుల ఆనందోత్సాహం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement