additional collections
-
అదనపు కలెక్టర్ల ఆటాపాట..
సాక్షి, కరీంనగర్: వారిది 1995లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్ (పీడీటీ)ల బ్యాచ్. 25 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకేచోట కలిశారు. ఇంకెముందీ.. చిన్నపిల్లల్లా కేరింతలు కొడుతూ ఆడి పాడారు. ఉన్నతస్థానాల్లో ఉన్న వీరంతా ఆదివారం కరీంనగర్‌లోని ఓ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. వయసు, హోదా మర్చిపోయి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్, నల్లగొండ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జోగులాంబ గద్వాల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈవో వెంకటమాధవరావు, సీనియర్ తహసీల్దార్ కుందారపు మహేశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పీఎస్ చంద్రమోహన్, వీటీడీఏ సెక్రటరీ భుజంగరావు, స్పీకర్ ఓఎస్డీ మోహన్‌రెడ్డి, ల్యాండ్స్‌షిప్ ఫెడరేషన్ ఓఎస్డీ లక్ష్మీ కిరణ్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శశిధరచారి, రెవెన్యూ వక్ఫ్ ట్రిబ్యునల్ మెంబర్ పూర్ణచంద్ర పాల్గొన్నారు. అధికారుల ఆనందోత్సాహం.. -
పదికి పరీక్ష!
• పరీక్ష ఫీజు పేరుతో అదనపు వసూళ్లు • దోపిడీకి రంగం సిద్ధం చేసిన ప్రైవేటు విద్యాసంస్థలు • అసలు ఫీజు రూ.125, వసూలు రూ.1,700 వరకు • జిల్లాలోని విద్యార్థులపై రూ.1.5 కోట్ల అదనపు భారం • చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు ‘పది’ ఈ సంఖ్యకు చాలా క్రేజ్ విద్యార్థుల భవితకు కీలకమైంది పదవ తరగతి. జీవితంలో ఇది తొలి పబ్లిక్ పరీక్ష కావడంతో అందరికీ ‘టెన్’షన్ ఇందులో ప్రతిభ కనబర్చిన వారికే గుర్తింపు అధికం దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేటు పాఠశాలలు దోపిడీ చేస్తున్నారుు. పరీక్ష ఫీజు పేరిట వేలకు వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.. ఇదంతా చూస్తూ కూడా విద్యాశాఖ యథావిధిగా మౌనం దాల్చుతోంది...! ఒంగోలు : పరీక్షల ఫీజుకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన రుసుం కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. ఎవరిష్టం వచ్చినంత వారు దోచుకొనేందుకు రంగం సిద్ధమైంది. పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు వాస్తవానికి రూ. 125 చెల్లించాల్సి ఉండగా.. ఏకంగా రూ.1000 రూ. 1500 వరకు వసూలు చేయడం పరిపాటిగా మారింది. జిల్లాలో ఈ అదనపు వసూలు విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. దీనిని పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విచారకరం. గత ఏడాది ఇదే వ్యవహారంపై జిల్లా పరిషత్ చైర్మన్ విద్యాశాఖకు చురకలు అంటించినా ఎలాంటి మార్పు రాలేదు. తుది గడువు ఈనెల 18.. పరీక్షల చెల్లింపునకు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఇప్పటికైనా అధికారులు పర్యవేక్షిస్తే దోపిడీని కొంతవరకు అరికట్టువచ్చని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే విద్యార్థులే నేరుగా చలానా చెల్లించే అవకాశం కల్పించాలి. దీనివల్ల యూజమాన్యాల పెత్తనాన్ని అరికట్టువచ్చు. వేలాది మంది విద్యార్థులు జిల్లాలో మొత్తం 370పైగా ప్రభుత్వ, జిల్లా పరిషత్,ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలున్నాయి.వీటిలో 24వేల మంది పదో తరగతి విద్యార్థులున్నారు.ఇక 300పైగా ప్రభుత్వ గుర్తింపు కలిగిన అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 16వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులు అరుుతే రూ. 125కి అదనంగా రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. అరుుతే వివిధ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో రూ.150 నుంచి రూ. 200 వరకు తీసుకుంటున్నారు. సరాసరిన ఒక్కొక్కరికి రూ. 50 అదనంగా చెల్లించినా రూ. 12 లక్షలు మేర అదనపు భారం తప్పడంలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో గరిష్టంగా రూ. 1700 వరకు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఎవరైనా అడిగితే విద్యాశాఖలోని అధికారులకు కూడా వాటాలు ఇచ్చుకోవాల్సి వస్తుందనే సమాచారం వినిపిస్తుంది. ప్రతి నామినల్ రోల్‌కు కనీసంగా రూ.100 నుంచి రూ.200 చొప్పున వసూలుచేస్తారని వినికిడి. రవాణా ఖర్చుల పేరుతో వసూళ్ల పర్వం.. విద్యార్థికి అందించే సర్వీస్‌తోపాటు పరీక్షల సమయంలో 11 రోజులపాటు విద్యార్థిని పాఠశాల వద్దనుంచి పరీక్ష కేంద్రం వరకు, తిరిగి అక్కడ నుంచి పాఠశాల వరకు క్షేమంగా తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు పేరుతో గుర్తింపు పొందిన పాఠశాలలు వసూళ్ల పర్వం మొదలుపెట్టేశాయి. ఇక కార్పొరేట్ పాఠశాలల తీరే వేరు. ఒక్కో విద్యార్థి వద్ద నుంచి సరాసరి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారని అనుకుంటే వసూలయ్యే మొత్తం రూ.1.92 కోట్లు. వాస్తవానికి విద్యార్థులు చెల్లించాల్సిన మొత్తం రూ.20 లక్షలు మాత్రమే. అంటే అనధికారికంగా వసూలు చేస్తున్న మొత్తం రూ.1.72 కోట్లు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాఠశాలల నుంచి రూ.12 లక్షలు, గుర్తింపు పొందిన అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల నుంచి రూ.1.72 కోట్లు వెరసి రూ.1.84 కోట్ల దోపిడీకి రంగం సిద్ధమైంది. -
దోపిడీకే మొగ్గు నిబంధనలు ఉఫ్..
♦ ఫీజుల నిర్ణయంపై జరగని సమావేశాలు ♦ ఇదీ జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్ల తీరు ♦ చేతులెత్తేసిన విద్యాశాఖ సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రైవేటు విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టాన్ని కాలరాస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రు ల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నాయి. గుర్తింపు పొందని విద్యాసంస్థలు సైతం ఫీజుల వసూళ్లపై దృష్టిసారించాయి. ఏం చేయలేక విద్యాశాఖ చేతులెత్తేసింది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఈనెల 15లోగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై ఫీజులపై నిర్ణయం తీసుకోవాలని డీఈఓ ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఒకటి జనవరి 1994లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం పాఠశాల స్థాయిలో గవర్నింగ్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. తరగతుల వారీగా ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఏ ఒక్క విద్యా సంస్థలో గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. సమావేశాలు ఏర్పాటు చేయకపోగా విద్యార్థులను చేర్పించుకుంటూ వారి తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అప్పుడే తరగతులను సైతం ప్రారంభించాయి. ఫలితంగా ఒక్కో తరగతికి ఒక్కో రకమైన ఫీజుతోపాటు అడ్మిషన్, ట్యూషన్ ఫీజుల పేరిట నెల వారీగా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం పక్కదారి... విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, అనాథ విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ నిబంధనను సైతం పట్టించుకోవడం లేదు. చట్టం తీసుకొచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క విద్యాసంస్థలో ఈ విధానం అమలుకు నోచుకోవడం లేదు. అనుమతులు లేని స్కూళ్లు సంగతేంటో... జిల్లాలో దాదాపు 274 ప్రైవేటు స్కూళ్లు అనుమతి లేకుండా నడుస్తున్నట్టు సమాచారం. సదరు పాఠశాలలు ఇప్పటివరకు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేకపోయాయి. ఇలాంటి పాఠశాలలు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో పదివరకు ఉంటాయి. కానీ ఒకటి నుంచి పదోతరగతి వరకు అడ్మిషన్లు ఇస్తూ విద్యార్థులను చేర్పించుకుంటూ వేలాది రూపాయలను డొనేషన్ల రూపంలో వసూలు చేస్తున్నాయి. ఈ పాఠశాలలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్‌కు నివేదిస్తాం.. నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 15లోగా గవర్నింగ్ బాడీ సమావేశాలు నిర్వహించి ఫీజులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి ఫీజులపై నిర్ణయం తీసుకున్నట్టు చేసిన తీర్మాన ప్రతులను డిప్యూటీ ఈఓ, ఎంఈఓల ద్వారా డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కూడా ఒక్క పాఠశాలలోనూ సమావేశాలు నిర్వహించినట్టు మాకు సమాచారం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. - నజీమొద్దీన్, డీఈఓ -
గుంజుడే..
♦ ప్రైవేటు స్కూళ్ల ఫీజు దందా ♦ ఖర్చుల మోతతో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు ♦ టై నుంచి పుస్తకాల వరకు అదనపు వసూళ్లు ♦ పాఠశాల స్థాయి చదువుకే రూ.లక్షల్లో ఖర్చు ♦ తల్లిదండ్రులపై ఏడాదికి రూ.50 కోట్ల అదనపు భారం? జూన్.. ఈ నెలొచ్చిందంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజు గండమే! ప్రైవేట్ స్కూలు యాజమాన్యాలు నిర్ణయించే ఫీజులు దడపుట్టిస్తాయి. టై నుంచి పుస్తకాల వరకు అన్నీ కలిపి తడిసి మోపెడవుతాయి. ఇక సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లలో ఫీజుల మాట వింటే కళ్లుబైర్లు కమ్మేస్తాయి. పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు నేర్పించేందుకు అప్పోసప్పో చేసేందుకూ తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. ఇప్పటికే స్కూళ్లు మొదలయ్యాయి. దోపిడీకి మరింత తెర లేవడంతో పాటు ఫీజుల వసూళ్లు తారస్థాయికి చేరాయి. బహిరంగంగా నిలువు దోపిడీ చేస్తున్నా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను నియంత్రించే దిక్కులేదు. జోగిపేట: జిల్లాలో 1,274 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా యి. ఫీజులే కాకుండా బుక్స్, నోట్‌బుక్స్, షూ, బ్యాగుల అమ్మకాల ద్వారా పాఠశాలల యాజ మాన్యాలు రూ.కోట్లు వెనకేసుకుంటున్నాయి. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. తనిఖీలకు వెళ్లిన అధికారులు ఇవన్నీ చూసినా.. కళ్లు మూసుకుంటుండటం విమర్శలకు దారితీస్తోంది. నిబంధనలు బేఖాతరు.. పాఠశాలల పునఃప్రారంభ సమయాన్ని స్కూళ్ల యజమానులు బాగా వాడుకుంటున్నారు. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండగా మరోవైపు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, షూ, టై, డైరీ తదితర రూపాల్లో అదనంగా గుంజుతున్నారు. వాస్తవంగా ఇవన్నీ పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలన్న నిబంధన ఎక్కడా లేదు. అయినా వారు స్కూళ్లలో ఏకంగా వీటికోసం ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచి అధిక ధరలకు విక్రయిస్తుండడం గమనార్హం. బహిరంగ మార్కెట్లో ఇవి తక్కువ ధరకు లభిస్తాయి. అయినా ఇక్కడే కొనాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎల్కేజీ పుస్తకాలు ఇలా... ఎల్కేజీ పుస్తకాలకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారంటే దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవే పుస్తకాలు బయట రూ.1,500కే లభిస్తున్నాయి. రూ.150కే లభించే షూ కొన్ని పాఠశాలల్లో రెట్టింపు ధరకు అంటగడుతున్నారు. స్కూళ్లలో సామగ్రి అమ్మడం జీఓ నం 91కి విరుద్ధం. ఒకవేళ యాజమాన్యాలు విక్రయించాలనుకుంటే సదరు స్కూల్‌కు సంబంధించిన అభ్యాసన సామగ్రి తదితరాలు లభ్యమయ్యే రెండు షాపులను ప్రత్యామ్నాయంగా చూపాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ తల్లిదండ్రులు కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం విద్యార్థులను తమ పాఠశాల వైపు ఆకట్టుకునేందుకు ప్రైవేట్ యాజమాన్యాలు పోటీ పడి ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రచారానికే లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. విద్యార్థులు తమ పాఠశాలలో చేరేలా ఉపాధ్యాయులను యాజమాన్యాలు ఇంటింటికీ పంపుతున్నాయి. ఒక్క అడ్మిషన్ తెస్తే రూ.500.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు యాజమాన్యాలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. పాఠశాలల్లో పీఆర్ఓల పేరుతో ముగ్గురు నుంచి ఐదుగురిని ఏర్పాటు చేసుకొని ఒక్క అడ్మిషన్ తెస్తే సదరు వ్యక్తికి రూ.500 నుంచి రూ.1,000 చెల్లిస్తున్నాయి. ప్రధాన పట్టణాల్లో ఈ పద్ధతి కొనసాగుతోంది. పీఆర్ఓలు తమ వ్యక్తిగత పలుకుబడితో ఈ సీజన్లోనే అడ్మిషన్లు తీసుకు వచ్చి వేలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా ఇలాంటి ఇన్సెంటివ్‌లు చెల్లిస్తున్నారు. దాదాపు రూ.50 కోట్ల అదనపు భారం జిల్లాలో 1,274 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ జాబితాలో సీబీఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ బోధించే స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కొన్నింటిలో ఒక్కో పాఠశాలలో 2,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి సగటున స్కూలు ఫీజుగా రూ.50 వేలు చెల్లిస్తున్నట్టు అంచనా. ఈ ఏడాదికి యాజమాన్యాలు దండుకుంటున్న మొత్తం రూ.50 నుంచి రూ.60 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. సీబీఎస్ఈ స్కూల్లో నర్సరీలో చేరేందుకు (హాస్టల్‌తో కలిపి) రూ.52 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. డేస్ స్కాలర్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఒక్కో విద్యార్థి 14 ఏళ్లపాటు పాఠశాల విద్యను పూర్తి చేసేందుకు ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలకు పైగానే వెచ్చించాల్సి వస్తుంది.