వీసా పొందిన విద్యార్థులతో యూఎస్ కాన్సుల్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: దేశంలోని యూఎస్ కాన్సులేట్లలో మంగళవారం 2,500 మంది విద్యార్థులను ఇంటర్వ్యూలు చేసినట్టు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. స్టూడెంట్ వీసా ఆరో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతాల్లో తమ అధికారులు భారత విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నట్టు హైదరాబాద్ కాన్సులేట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఇంటర్వ్యూల్లో వీసాలు పొందిన విద్యార్థులకు చార్జ్‌డీ అఫైర్స్ పాట్రీషియా లాసినా, కాన్సుల్ జనరల్స్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తూ అమెరికా–ఇండియా సంబంధాలను మరిం త విస్తృతం చేయాలని చార్జ్ డీ లాసినా ఆకాంక్షిం చారు. ఇప్పటికే అమెరికా–ఇండియా ద్వైపాక్షిక సంబంధాల్లో 75 వసంతాల ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు లాసినా గుర్తు చేశారు. అమెరికాలో ఉన్నత విద్య నసభ్యసిస్తున్న వారిలో భారతీయ విద్యార్థుల వాటా 20% ఉం టుందని, సంఖ్యా పరంగా 2 లక్షల మం దికిపైగానే ఉన్నారని కాన్సులేట్ పేర్కొంది.
ఈసారి రికార్డు బద్దలు
గతం కంటే ఈ ఏడాది స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూల్లో రికార్డు బద్దలు కొడతామని మినిస్టర్ కౌన్సెలర్ ఫర్ కాన్సులర్ ఆఫైర్ డాన్ హెల్పిన్ స్పష్టం చేశారు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ కౌన్సెలర్ ఆంథోని మిరిండా మాట్లాడుతూ విద్యార్థులు యూఎస్ విద్యా విధానాన్ని ఉత్తమంగా ఎంచు కుంటున్నారని, ప్రపంచస్థాయిలో అత్యుత్తమ మౌలిక సద పాయాలను కల్పిస్తోందని అన్నారు.
అమెరికా విద్యావ్యవస్థ 4వేలకుపైగా విద్యాసంస్థలు, వర్సిటీలకు అక్రిడేషన్ గుర్తింపు కల్పించిందన్నారు. విద్యార్థులు తదుపరి సందేహాల నివృత్తి, విద్యావిధానం సమాచారం కోసం educationusa.state.gov ఇన్‌స్టా గ్రామ్, ఫేస్‌బుక్ తదితర మాధ్యమా లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment