
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో నేడు మరో కీలక పరిణామం జరుగనుంది. సుప్రీంకోర్టులో కవిత ఈడీ కేసు పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇక, ఈరోజు విచారణ సందర్భంగా ఈడీ నోటీసులకు కవిత హాజరుకావడంలేదని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన అడిషినల్ సొలిసిటర్ జనరల్. ఈ క్రమంలో ఈడీ నోటీసులను సవాల్ చేయడం వల్లే హాజరుకాలేదని చెప్పిన కవిత తరఫు లాయర్ కపిల్ సిబల్. అనంతరం, కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం, కవిత కేసులను ఉమ్మడిగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 16వ తేదీన తుది వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు సూచించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కవితను పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. దీంతో, ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కవిత కోరారు.
Comments
Please login to add a commentAdd a comment