
సాక్షి, హైదరాబాద్ : జనవరి 16 నుంచి 140 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా హ్యాపీగా ఉన్నారని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కరోనా విషయంలో సీఎం కేసీఆర్ ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసేందుకు 22,732 మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. అధికారుల తర్వాత ప్రజలకు వ్యాక్సిన్ వేస్తామన్నారు. చదవండి: రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్
రేపటి నుంచి అదనంగా 1000 వ్యాక్సిన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని, ప్రపంచానికి ఉపయోగపడే వ్యాక్సిన్ హైదరాబార్‌లో తయారవుతుండటం మనందరికీ గర్వ కారణమన్నారు. కావాలనే మూర్ఖత్వంతో కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా ధైర్యంగా ముందుకు రావాలని, అధికారుల తర్వాత ప్రజలకు వేసేముందు జర్నలిస్టుల కుటుంబాలకు వ్యాక్సిన్ వేస్తామని అన్నారు,
Comments
Please login to add a commentAdd a comment