జడ్చర్ల టౌన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో తరగతి గదిలోనే నిద్రపోయిన ఘటన ఇది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. డిసెంబర్‌లో ఉపాధ్యాయుడు శశికాంత్ ఈ పాఠశాలకు బదిలీపై వచ్చారు.
సోమవారం మద్యం మత్తులో తరగతి గదిలోనే నిద్రపోవడాన్ని గ్రామ యువకులు గమనించి లేపారు. ఆయన సరైన సమాధానం ఇవ్వకుండా.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయాన్ని ఎంఈవో మంజులాదేవి దృష్టికి తీసుకెళ్లగా పాఠశాలకు వేరే ఉపాధ్యాయుడిని పంపిస్తామని, సదరు ఉపాధ్యాయుడు శశికాంత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment