సాక్షి, హైదరాబాద్: ‘నా శాఖలైన పౌర సరఫరాలు, పర్యావరణ శాఖల సమీక్షకు రాష్ట్ర మంత్రులెవరూ హాజరవలేదు. ప్రొటోకాల్ పాటించలేదు. అతిథి మర్యాద లేదు’ అని కేంద్ర అటవీ, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సమీక్షకు ఆయా శాఖల అధికారులే వచ్చారన్నారు. ఆదివారం రాత్రి మీడియాతో చౌబే మాట్లాడుతూ ‘2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు రూ. 26 వేల కోట్లు చెల్లించింది’ అని చెప్పారు.
‘కేంద్రంపై అవినీతి ఆరోపణల్లో నిజం లేదు. మోదీ చరిత్రలో అవినీతికి తావులేదు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుంది’ అన్నారు. తెలంగాణతో ఇతర రాష్ట్రాల రేషన్ షాపుల్లో 2023 కల్లా ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 2024లో దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లోకి తెస్తామన్నారు. ‘తెలంగాణలో 25 రైస్ మిల్లులు తమ మిషనరీని అప్‌గ్రేడ్ చేసుకున్నాయి. మున్ముందు మిగతా రైస్ మిల్లులూ అప్‌గ్రేడ్ కానున్నాయి’ అని అశ్వనీకుమార్ చౌబే వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment