Ashwini Kumar
-
కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తాం: కేంద్రమంత్రి అశ్విని చౌబే
సాక్షి, హన్మకొండ జిల్లా: లిక్కర్ కేసులో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తామంటూ కేంద్రమంత్రి అశ్విని చౌబే వ్యాఖ్యానించారు. హంటర్ రోడ్డులో మీడియా సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.వంద కోట్లు గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీకి కవిత ఇచ్చారు. కేసీఆర్ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండూ ఒకటే. బీజేపీని ఎదుర్కొలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏకమయ్యాయి. తెలంగాణలో కమలం వికసిస్తుందని నా నమ్మకం’’ అని అశ్విని చౌబే ధీమా వ్యక్తం చేశారు. చదవండి: కామారెడ్డి రూపురేఖలు మారుస్తా: కేసీఆర్ -
భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు- కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే
న్యూఢిల్లీ: షహీద్ భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన " క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంధాన్ని ముఖ్య అతిధి కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్ , ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023 న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చెసిన శాంభవి మఠాధిపతి స్వామి ఆనంద్ స్వరూప్ మహారాజ్ మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి కాన్వాయ్‌కు ప్రమాదం..
కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి బక్సర్ నుంచి పాట్నా వెళుతుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. డుమ్రాన్‌లోని మథిలా-నారాయణపూర్ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోల్తాకొట్టిన కారు కాలువలో పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయిదుగురు పోలీసులతో సహా డ్రైవర్‌కు గాయలవ్వగా.. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీస్ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో వెనకాలే కేంద్రమంత్రి కారు ఉండడం గమనార్హం. అయితే ఈ ఘటనలో కేంద్ర మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలానికి చెందిన ఓ వీడియోను ఆయన ట్విటర్లో పంచుకున్నారు. ప్రమాదంలో బోల్తా పడిన ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి తనిఖీ చేయడాన్ని చూడవచ్చు. అనంతరం ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ‘బక్సర్ నుంచి పాట్నాకు వెళ్లే క్రమంలో కోరన్‌సరాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వాహనం దుమ్రావ్ మథిలా-నారాయణపూర్ రహదారి వంతెన కాలువలో ప్రమాదానికి గురైంది. శ్రీరాముని దయవల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. గాయపడిన పోలీసులు, డ్రైవర్‌ను డుమ్రావ్ సదర్ ఆసుపత్రికిలో చేర్చారు’ అని ట్వీట్ చేశారు. కాగా బీజేపీ నేత అశ్విని కుమార్ చౌబే ప్రస్తుతం కేంద్ర పర్యావరణం, అటవీ, వినియోగదారుల వ్యవహారాలు. ఆహారం ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. చదవండి: మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. बक्सर से पटना जाने के क्रम में डुमराव के मठीला-नारायणपुर पथ के सड़की पुल के नहर में कारकेड में चल रही क़ोरानसराय थाने की गाड़ी दुर्घटनाग्रस्त हो गई है। प्रभु श्रीराम की कृपा से सभी कुशल हैं। घायल पुलिसकर्मियों एवं चालक को लेकर डुमराव सदर अस्पताल जा रहा हूं। pic.twitter.com/ybTVi6jn5v — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) January 15, 2023 -
రాజకీయ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అంశాలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వానికి ఇలాంటి అంశాలను పరిశీలించడానికి తగిన అధికారం ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ జాతీయులను సంవత్సరంలోగా గుర్తించి, నిర్భంధించి, దేశం నుంచి బహిష్కరించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ గురువారం జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ‘‘పార్లమెంట్ సభ్యుల సమస్య, నామినేషన్ సమస్య, ఎన్నికల సంస్కరణలు ఇలా ప్రపంచంలోని ఎన్నో సమస్యలు, దాంతోపాటు ఇక ప్రతిరోజూ మీ కేసును మాత్రమే వినాలి! అవి రాజకీయ అంశాలు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి. మీరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను(పిల్) మేము(న్యాయస్థానం) విచారణకు స్వీకరించాల్సి వస్తే.. ఇక ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నట్టు? చట్టాలు చేయడానికి రాజ్యసభ, లోక్‌సభ ఉన్నాయి’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ పిటిషన్‌కు కౌంటరు వేయాలని కేంద్రం భావిస్తే జాబితాలో చేరుస్తామని చెప్పారు. -
మంత్రుల్లేరు.. ప్రొటోకాల్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘నా శాఖలైన పౌర సరఫరాలు, పర్యావరణ శాఖల సమీక్షకు రాష్ట్ర మంత్రులెవరూ హాజరవలేదు. ప్రొటోకాల్ పాటించలేదు. అతిథి మర్యాద లేదు’ అని కేంద్ర అటవీ, పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సమీక్షకు ఆయా శాఖల అధికారులే వచ్చారన్నారు. ఆదివారం రాత్రి మీడియాతో చౌబే మాట్లాడుతూ ‘2021లో 141.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు రూ. 26 వేల కోట్లు చెల్లించింది’ అని చెప్పారు. ‘కేంద్రంపై అవినీతి ఆరోపణల్లో నిజం లేదు. మోదీ చరిత్రలో అవినీతికి తావులేదు. కేంద్రంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే అది మీ మీదే పడుతుంది’ అన్నారు. తెలంగాణతో ఇతర రాష్ట్రాల రేషన్ షాపుల్లో 2023 కల్లా ఫోర్టిఫైడ్ రైస్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 2024లో దేశవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లోకి తెస్తామన్నారు. ‘తెలంగాణలో 25 రైస్ మిల్లులు తమ మిషనరీని అప్‌గ్రేడ్ చేసుకున్నాయి. మున్ముందు మిగతా రైస్ మిల్లులూ అప్‌గ్రేడ్ కానున్నాయి’ అని అశ్వనీకుమార్ చౌబే వివరించారు. -
హరిత టపాసులతో కాలుష్యానికి చెక్
సాక్షి, అమరావతి: దీపావళి సందర్భంగా పెద్దఎత్తున వెలువడే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి హరిత టపాసులు చక్కని ప్రత్యామ్నాయంగా మారాయి. తక్కువ కాలుష్యం వచ్చే హరిత టపాసులనే దీపావళి రోజున వినియోగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చాయి. దీపావళి సందర్భంగా వినియోగించే సాధారణ టపాసుల వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలై అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో పీల్చే గాలి అత్యంత విషపూరితంగా మారడంతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. రాష్ట్రంలో దీపావళి రోజున వాయు కాలుష్యం సాధారణ రోజు కంటే ఐదురెట్లు ఎక్కువ ఉన్నట్లు గతంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్ధారించారు. సాధారణంగా గాలిలో ధూళికణాలు (పీఎం 10, పీఎం 2.5) 60కి మించకూడదు. కానీ దీపావళి రోజున 300 నుంచి 400కు పైగా ఉంటున్నాయి. టపాసుల నుంచి బేరియం, అల్యూమినియం, పొటాషియం నైట్రేట్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు, లోహాల ధూళి వెలువడుతోంది. అలాగే శబ్దాలు సాధారణ స్థాయి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. వీటివల్ల ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు వస్తున్నాయి. అందుకే హరిత టపాసులు వాడాలని కాలుష్య నియంత్రణ మండలి ప్రచారం చేస్తోంది. అన్నిచోట్ల అందుబాటు తక్కువ కాలుష్య కారకాలు విడుదల చేసేలా హరిత టపాసుల ఫార్ములాను మూడేళ్ల కిందట శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్), జాతీయ పర్యావరణ, ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ (నీరి) సంయుక్తంగా రూపొందించాయి. బాణసంచా తయారు చేసేవారికి దీని గురించి వివరించి ఈ ఫార్ములాతోనే టపాసులు తయారు చేయాలని ఈ సంస్థలు కోరాయి. అనేకమంది తయారీదారులు ఇందుకోసం ఒప్పందాలు కూడా చేసుకున్నారు.తక్కువ బూడిద, ముడిపదార్థాలను వాడి చిన్న సైజులో హరిత టపాసులను తయారు చేస్తారు. చూడ్డానికి ఇవి మామూలు టపాసుల్లానే ఉంటాయి. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు, బాంబులు వంటివి కూడా ఉంటాయి. ఇవి సాధారణ టపాసుల కంటె 30 నుంచి 50 శాతం తక్కువ ధూళి కణాలను విడుదల చేస్తాయి. కాలుష్యకారక వాయువులు, పొగ, శబ్దాలు కూడా తక్కువగానే విడుదలవుతాయి. సాధారణ టపాసులు విక్రయించే షాపుల్లో కూడా వీటిని విక్రయిస్తున్నారు. అలాగే పెద్ద షాపులు, సూపర్ మార్కెట్లతోపాటు ఆన్లైన్లోను ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిపై ప్రత్యేకంగా గ్రీన్‌లోగో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. హరిత టపాసులతో పర్యావరణ పరిరక్షణ ప్రజలందరు హరిత టపాసులను కాల్చాలి. అప్పుడు ప్రజారోగ్యానికి ఇబ్బందులు తప్పుతాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దీపాల పండుగను అందరు సురక్షితంగా జరుపుకోవడానికి హరిత టపాసులు ఉపయోగపడతాయి. – అశ్వినీకుమార్ పరిడ, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ -
బిల్డర్ల మోసాల నుంచి రక్షణ కల్పించాలి
న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు బిల్డర్లు, ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్రం నమూనా ఒప్పందాలను సిద్ధం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ ‘మోడల్ బిల్డర్ బయ్యర్ అగ్రిమెంట్’, ‘మోడల్ ఏజెంట్, బయ్యర్ అగ్రిమెంట్’లను అమలయ్యేలా చూడాలని కూడా బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ తన పిల్లో కోరారు. ప్రమోటర్లు, బిల్డర్లు, ఏజెంట్లూ ఏకపక్షమైన ఒప్పందాలను ఉపయోగిస్తూంటారని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21లకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసి భవనాలను కొనుగోలుదార్లకు అందించడంలో విపరీతమైన జాప్యం చేయడం, వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం ఇప్పటికే చాలాసార్లు జరిగాయనీ, ఏకపక్ష ఒప్పందాల్లోని నిబంధనలను సాకుగా చూపుతున్నారని అశ్విని కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ‘‘బిల్డర్లు డెలివరీ షెడ్యూల్‌ను పదే పదే జారీ చేస్తూంటారు. అనైతికమైన, ఏకపక్షమైన వ్యాపార కార్యకలాపాలు చేస్తూంటారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఫ్రాడ్, మోసం, విశ్వాస ఘాతుకం, నిజాయితీ లేకపోవడం, కార్పొరేట్ చట్టాల ఉల్లంఘన, భవనాల విషయంలో అవకతవకలు జరుగుతూంటాయి’’అని వివరించారు. ఈ చర్యలన్నింటి వల్ల వినియోగదారులు మానసిక, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని, అంతేకాకుండా తాము జీవించే, జీవనోపాధి హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే సాఫ్ట్ లాంచ్ చేయడం చట్టాన్ని నేరుగా అతిక్రమించడమేనని ఆరోపించారు. విక్రయానికి ముందుగా నియంత్రణ సంస్థల వద్ద ఆ ప్రాజెక్టును నమోదు చేయడం అవసరమని, బిల్డర్ వద్ద అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని కూడా ఈ పిటిషన్లో కోరారు. -
కేంద్రమంత్రితో మాట్లాడిన ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఫోన్లో మాట్లాడారు. అశ్వినీ కుమార్‌తో మాట్లాడిన ఈటల రాజేందర్ ఆయనకు మూడు విజ్ఞప్తులు చేసినట్లుగా తెలిపారు. 1500 పడకల టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఆసుపత్రికి 1000 వెంటిలేటర్స్ అడిగాం అని తెలిపిన రాజేందర్ వెంటనే వాటిని అందజేయాలని కోరినట్లు చెప్పారు. అదేవిధంగా హెసీఎల్ నుంచి పీపీఈ కిట్లు, యన్- 95 మాస్క్‌లు అందిస్తామని కేంద్రం తెలిపిన అవి తగినంతగా రావడంలేదని, కేంద్రం వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఈ కిట్లను, యన్-95 మాస్క్‌లను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నప్పటికి ఎక్కువ ధరకు కొనవలసి వస్తుందని తెలిపారు. అదే కేంద్రం అందిస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఈటెల తెలిపారు. (ఇకపై ఆంక్షలు మరింత కఠినం : అంజనీకుమార్) -
కరోనా వైరస్ మాటున స్వైన్ ఫ్లూ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కాలానుగుణంగా సంక్రమించే వైరస్ అంటు వ్యాధులను మొదటి సారిగా 2009లో గుర్తించారు. జనవరి నుంచి మార్చి, జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ వైరస్ల వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారు. 2019లోనే భారత దేశాన్ని స్వైన్ ఫ్లూ కుదిపేసింది. శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘హెచ్1ఎన్1’గా వ్యవహరించే ఈ వైరస్ కేసులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో భారత్‌లో రెట్టింపు అయ్యాయి. (చదవండి: ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) ఈ ఏడాది కూడా మార్చి వరకు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు 1100 దాఖలుకాగా, 28 మంది మరణించారు. ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఫిబ్రవరి నెలలో జర్మనీకి చెందిన కంపెనీ స్వాప్ భారత్‌లోని తన యూనిట్‌ను మూసివేసింది. బెంగళూరులోని తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి మొదటి వారానికి ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 78 కేసులు నమోదయ్యాయి. వారిలో 19 మంది పోలీసులు అస్వస్థులుకాగా వారిలో 9 మంది మరణించారు. అదే నెలలో ఈ వైరస్ కారణంగా ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జీలు అస్వస్థులయ్యారు. 2018 సంవత్సరంలో పోల్చినట్లయితే 2019లో స్వైన్ ప్లూ కేసులు రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్వణి కుమార్ చౌబే స్వయంగా లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. మరణాలు కూడా అదే నిష్పత్తిలో పెరిగాయి. కోవిడ్ మహమ్మారి గురించి వార్తలు వెలువడడంతో ఈ స్వైన్ ఫ్లూ కేసులు మరుగున పడిపోయాయి. వాస్తవానికి రెండు వైరస్ల లక్షణాలు ఒకే రీతిగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు మంట, శ్వాస ఇబ్బంది, జ్వరం బాధిస్తాయి. వైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకటే! (కరోనా ఎఫెక్ట్ : అలిపిరి టోల్గేట్ మూసివేత) -
పోలీసులపై కేంద్రమంత్రి చిందులు
పట్నా: కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు. బిహార్‌లోని బక్సర్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పోలీసులపై తన ప్రతాపానన్ని చూపించారు. ఓ ఘటన నిమిత్తం బీజేపీ కార్యకర్తపై కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. బీజేపీ కార్యకర్తను గుండా అని పిలువాలని నీకు ఎవరు చెప్పారని పోలీసుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండా అంటూ పార్టీ కార్యకర్తకు ఎలా నోటీసులు ఇచ్చావని నిలదీశారు. మంగళవారం జరిగిన జనతా దర్బార్ సమావేశంలో తన దృష్టికి వచ్చిన ఈ ఘటన పట్ల మంత్రి స్పందించారు. రాష్ట్రంలో 2003 నుంచి జరిగిన అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై గుండా అంటూ పోలీసులు కేసులు పెట్టారని మంత్రి తెలిపారు. ఎవరినైనా గుండా అంటూ సంబోధించడం సరికాదు అని మంత్రి అన్నారు. కాగా గతంలో కూడా ఆయన పలుమార్లు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన కాన్వాయ్‌ని ఆపారన్న కారణంతో స్థానికులపై మంత్రి నోరుపారేసుకున్నారు. అయితే తాజాగా ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH Union Minister Ashwini Choubey threatens a police personnel for registering a case against a BJP party worker says, "Kisne kaha tha apko inko gunda kehne ko? Kyun gunda ka notice diya aapne?" He was holding a 'Janta Darbar'in Buxar yesterday . #Bihar pic.twitter.com/nw60sk1QwZ — ANI (@ANI) September 24, 2019 -
శిశు మరణాల రేటు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శిశుమరణాల రేటు తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ ఛౌబే మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) శాంపిల్ రిజిస్ట్రేషన్ నివేదిక ప్రకారం 2014లో ప్రతి వేయి నవజాత శిశువుల్లో 26 మరణాలు సంభవించగా.. 2016 నాటికి ఆ సంఖ్య 24కు తగ్గినట్లు తెలిపారు. శిశు జననాలలో తగ్గిపోతున్న లింగ నిష్పత్తి ఆడ పిల్లల పట్ల సమాజంలో పాతుకుపోయిన వివక్షకు అద్దం పడుతున్నాయని మంత్రి వివరించారు. మగ పిల్లల కోసం కుటుంబాలు పరితపించడం, సంతాన సాఫల్యత క్షీణించడం, టెక్నాలజీ దుర్వినియోగం వంటివి ఆడ పిల్లల జనన రేటు తగ్గిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ వరవడిని కట్టడి చేయడానికి ప్రభుత్వం చట్టాలను చేయడంతో పాటు ఆడ పిల్లలకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు బేటీ బచావో బేటీ పఢావో వంటి బృహత్తరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందు కోసం 2014లో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు. 2030 నాటికి లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శిశు మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్రమబద్దమైన తనిఖీల ద్వారా శిశు జననాలను పర్యవేక్షించడం, ఆడ పిల్లల పట్ల సానుకూల దృక్పధం ఏర్పడటానికి వీలుగా సమాజంలో చైతన్యం కలిగించేందుకు చర్యలు, లింగ నిర్ధారణకు సంబంధించి ఇంటర్నెట్ ఇతర మాధ్యమాల్లో ప్రకటనలు తొలగించేందుకు 2016లో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసం కార్యక్రమాలను అమలు చేసే రాష్ట్రాలకు ఆర్థిక తోడ్పాటు వంటివి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగమేనన్నారు. ఆడ పిల్లల పట్ల సమాజంలో నెలకొన్న ఆలోచనా విధానాన్ని మార్చడమే బేటీ బచావో బేటీ పఢావో పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. లింగ నిర్థారణ ద్వారా భ్రూణ హత్యల నియంత్రణ, ఆడ శిశువులకు రక్షణ వంటివి ఈ పథకం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలని మంత్రి తెలిపారు. -
‘నీట్’ క్వాలిఫై అయితేనే విదేశాల్లో ఎంబీబీఎస్
న్యూఢిల్లీ : విదేశాల్లో ఎంబీబీఎస్ తత్సమానమైన వైద్య విద్యా కోర్సుల్లో చేరదలచుకున్న అభ్యర్థులు కచ్చితంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌లో(నీట్) అర్హత సాధించాలని ఆరోగ్య శాఖ సహాయం మంత్రి అశ్వినీ కుమార్ చౌబే స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన మంగళవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. అలాగే రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) నిర్వహించే స్ర్కీనింగ్ టెస్ట్ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే ప్రతి అభ్యర్థి ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్‌ను పొందాల్సి ఉండేదన్నారు. 2018 మర్చిలో ఈ నిబంధనలను సవరించారని.. ప్రస్తుతం విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలంటే నీట్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని వివరించారు. నీట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంసీఐ నుంచి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ పొందాల్సి అవసరం లేదన్నారు. గడిచిన మూడేళ్లలో ప్రపంచంలోని 48 దేశాల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమానమైన మెడికల్ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ అభ్యర్థులు 41,562 మంది ఉన్నట్టు వెల్లడించారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న వారి సంఖ్య 8,328గా ఉందన్నారు. భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఎంబీబీఎస్ చదువుతున్న దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా, జార్జియా, కిర్గిస్తాన్, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ మొదటి పది స్థానాల్లో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. విదేశాల్లో మెడిసిన్ చదవడానికి అనుమతి కోరుతూ 2019 జనవరి వరకు ఎంసీఐకి 4,558 దరఖాస్తులు అందయాని.. అందులో అత్యధికులు చైనాలో చదివేందుకే ఆసక్తి చూపారని పేర్కొన్నారు. 35 కోట్ల ఎల్ఈడీ బల్బుల పంపిణీ.. ఉజాలా పథకం కింద దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి గృహ వినియోగదారులకు 35 కోట్ల 16 లక్షల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేసినట్టు విద్యుత్ శాఖ సహాయ మంత్రి కేకే సింగ్ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బులు నాణ్యతా నియంత్రణ ప్రమాణాలకు లోబడి ఉంటాయని చెప్పారు. దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం ఎల్ఈడీ బల్బుల తయారీ విషయంలో ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మార్కెట్లో ఉన్న తయారీదారులకు ఇప్పటివరకు 111 కోట్ల ఎల్ఈడీ బల్బులను విక్రయించినట్టు పేర్కొన్నారు. ఉజాలా పథకం కింద పంపిణీ చేస్తున్న ఎల్ఈడీ బల్బుల్లో విఫలమవుతున్న వాటి శాతం అతి తక్కువగా ఉన్నట్టు ఒక అధ్యయనంలో వెల్లడైందన్నారు. -
‘స్వైన్‌ఫ్లూతో ఏపీలో 21 మంది మరణించారు’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్వైన్‌ఫ్లూ బారినపడి 2018 నుంచి ఇప్పటివరకు 21 మంది మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. ఏపీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మంగళవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2018లో ఏపీలో 402 మంది స్వైన్ ఫ్లూ బారినపడగా 17 మంది మరణించారని పేర్కొన్నారు. 2019లో ఏపీలో ఇప్పటివరకు 77 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో నలుగురు మృత్యువాత పడ్డారని చెప్పారు. చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో అత్యధికంగా 169 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో 66 కేసులు నమోదు కాగా, అందులో ఆరుగురిని ఈ వ్యాధి కబళించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ ఆడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆడ్మిషన్లలో రిజర్వేషన్లు ఏ విధంగా అమలు చేయాలన్న విషయంలో ఆయా రాష్ట్రాలదే తుది నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జీవో నంబర్ 550ని ఉల్లంఘిస్తూ జరిపిన మెడికల్ సీట్ల భర్తీ కారణంగా రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయం మీ దృష్టికి వచ్చిందా అని మంగళవారం రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ దుబే మెడికల్ కాలేజీ అడ్మిషన్ల కోసం ప్రతి రాష్ట్రం సొంతంగా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ఆలిండియా కోటాలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. -
రాహుల్ గాంధీ బయోపిక్
ఎన్నికలు సమీపించడంతో రాజకీయ నాయకుల కథలను తెర మీద ఆవిష్కరించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు దర్శకులు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోది మీద సినిమా తయారవుతుండగా సౌత్‌లో ఎన్టీఆర్, వైయస్సార్, ఎంజీఆర్, జయలలిత మీద సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా సినిమా రూపొందుతోంది. రూపేశ్ పౌల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రకథ ఇందిరా గాంధీ హత్య నుంచి మొదలై, ప్రస్తుత ఎన్నికల వరకూ సాగుతుందట. ‘మైనేమ్ ఈజ్ రాగా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాహుల్‌గా అశ్వినీకుమార్ నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అపజయాలు ఎదుర్కొని విజయం సాధించిన రాహుల్ కథను చెప్పదలిచాను. అతని పోరాట పటిమను చూసి స్ఫూర్తి పొంది ఈ చిత్రం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
1,472 మందికి ఒకే డాక్టర్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 1,472 మందికి ఒక డాక్టర్ చొప్పున అందుబాటులో ఉన్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వెల్లడించారు. టీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి లోక్‌సభలో ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యిమందికి ఒక డాక్టర్ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో డిసెంబరు 31, 2018 నాటికి భారత వైద్య మండలి వద్ద 11.46 లక్షల మంది అలోపతిక్ వైద్యులు నమోదై ఉన్నారని, ఇందులో దాదాపు 80 శాతం మంది సేవలు అందిస్తారని అంచనా వేస్తే దాదాపు 9.17 లక్షల మంది వైద్యులు ఉన్నారని వివరించారు. వీరు కాకుండా 7.63 లక్షల ఆయుర్వేద, యునానీ, హోమియోపతి వైద్యులు నమోదై ఉన్నారని, వీరిలో 80 శాతం మంది సేవలు అందిస్తున్నట్లు అంచనా వేస్తే వీరి సంఖ్య 6.10 లక్షలుగా ఉంటుందని వివరించారు. 2.5 లక్షల మంది దంత వైద్యులు ఉన్నారని వివరించారు. దేశంలో వైద్యుల సంఖ్య పెంచేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని, అనేక స్పెషలిస్ట్ విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పతిని 1:2 నుంచి 1:1కు తగ్గించామన్నారు. ఎంబీబీఎస్ సీట్ల గరిష్ట ప్రవేశాల పరిమితిని 150 నుంచి 200కు పెంచామని, వైద్య కాలేజీల స్థాపన నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ వైద్య కాలేజీలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వాటిని బలోపేతం చేసి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు చౌబే తెలిపారు. -
‘డ్యాన్స్ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్’
చండీగఢ్ : తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చోప్రాకు, హర్యానా సింగర్ కమ్ డాన్సర్ సప్నా చౌదరి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నా డ్యాన్స్ పోగ్రామ్స్ చూస్తున్నందుకు అశ్వినీ కుమార్‌కు ధన్యవాదాలు, అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీ మానసిక స్థితి ఎలా ఉందో అర్థమైపోతోంది’ అంటూ సప్నా చౌదరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే నా కర్తవ్యం. ఇకపై కూడా నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు నేను ఏమాత్రం వెనుకాడబోను. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు’ అంటూ ఆమె స్పష్టం చేశారు. అయినా వయసులో తన కంటే పెద్దవారి నుంచి క్షమాపణలు కోరడమనేది సంస్కారం అనిపించుకోదన్నారు. అసలు విషయమేమిటంటే.... సింగర్, డ్యాన్సర్‌గా సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. సప్నా చౌదరితో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సప్నా చౌదరి, యూపీఏ చీఫ్ సోనియా గాంధీని కలిసేందుకు గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ... ‘డ్యాన్స్ చేయడం వస్తే చాలు కాంగ్రెస్ పార్టీలో సెటిల్ అవ్వొచ్చు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే డ్యాన్సర్లు ఎక్కువైపోయారు. అసలు ఆ పార్టీ ఏం కోరుకుంటోంది...? ఎన్నికల్లో గెలవాలనా లేదా డ్యాన్సర్లతో పార్టీని నింపేయాలనా’ అంటూ వ్యాఖ్యానించారు. -
నేనేందుకు లొంగిపోవాలి?
న్యూఢిల్లీ : భాగల్పూర్లో మతఘర్షణ కేసులో లొంగిపోయేది లేదని కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శష్వత్ చౌబే అన్నారు. పోలీసుల ఎదుట తాను లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన న్యాయస్థానమే తనకు రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేనేందుకు లొంగిపోవాలి? కోర్టు వారెంట్ జారీ చేసింది కానీ అదే కోర్టు నాకు రక్షణ కల్పిస్తుంది. పోలీసులు ఒక్కసారి కోర్టుకు వెళ్లితే అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తుంద’ని అన్నారు. తాను ఎక్కడికి పారిపోవట్లేదని, జనం మధ్యలో ఉన్నానని తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే సహకరిస్తానని, కోర్టుకు వెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకుంటానని చెప్పారు. బిహర్‌లోని భాగల్పూర్లో మార్చి 17న రెండు వర్గాల మధ్య మతఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో అరిజిత్‌తో సహా మరో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు శనివారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కాగా ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీశ్‌కుమార్ విఫలమయ్యారని విమర్శించారు. అరిజిత్‌ను కాపాడేందుకు డమ్మి అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఆరోపించారు. -
‘హిందీ తప్పనిసరి’పై సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకూ హిందీని తప్పనిసరిచేస్తూ కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ వేసిన ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి అశ్వినీ కుమార్ ఉపాధ్యాయపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్ ప్రశ్నల వర్షం కురిపించారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మీరే ఆ పని ఎందుకు చేయకూడదు? ఎలాగూ మీ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి మీరు కూడా ప్రభుత్వంలో భాగమే కదా.. అని ప్రశ్నించారు. ధర్మాసనంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ స్పందిస్తూ.. ఇతర భాషలు మాట్లాడే ప్రజలు కూడా హిందీ తప్పనిసరి నిబంధనను ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కేంద్రం తరఫున వేసిన పిటిషన్‌గానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. -
‘ఆదర్శ నేత సోనియా’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి అశ్వినీ కుమార్ అండగా నిలిచారు. సోనియా ఆదర్శవంతమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. అయితే, అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని కుమార్ అంగీకరించారు. కాగా, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ కూడా అశ్వినీ కుమార్‌తో శ్రుతి కలిపారు. క్షేత్రస్థాయిలోని కాంగ్రెస్ కార్యకర్తలు సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. సోనియా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రిటైర్డ్ కాకూడదని మరో నేత వీరప్ప మొయిలీ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే ముందు రాహుల్ నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని మరో నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.