ఎన్నికలు సమీపించడంతో రాజకీయ నాయకుల కథలను తెర మీద ఆవిష్కరించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు దర్శకులు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోది మీద సినిమా తయారవుతుండగా సౌత్‌లో ఎన్టీఆర్, వైయస్సార్, ఎంజీఆర్, జయలలిత మీద సినిమాలు రూపొందుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా సినిమా రూపొందుతోంది. రూపేశ్ పౌల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రకథ ఇందిరా గాంధీ హత్య నుంచి మొదలై, ప్రస్తుత ఎన్నికల వరకూ సాగుతుందట. ‘మైనేమ్ ఈజ్ రాగా’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాహుల్‌గా అశ్వినీకుమార్ నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘అపజయాలు ఎదుర్కొని విజయం సాధించిన రాహుల్ కథను చెప్పదలిచాను. అతని పోరాట పటిమను చూసి స్ఫూర్తి పొంది ఈ చిత్రం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment