సాక్షి, హైదరాబాద్: కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. అశ్వినీ కుమార్‌తో మాట్లాడిన ఈటల రాజేందర్ ఆయనకు మూడు విజ్ఞప్తులు చేసినట్లుగా తెలిపారు. 1500 పడకల టిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఆసుపత్రికి 1000 వెంటిలేటర్స్ అడిగాం అని తెలిపిన రాజేందర్ వెంటనే వాటిని అందజేయాలని కోరినట్లు చెప్పారు. అదేవిధంగా హెసీఎల్ నుంచి పీపీఈ కిట్లు, యన్- 95 మాస్క్‌లు అందిస్తామని కేంద్రం తెలిపిన అవి తగినంతగా రావడంలేదని, కేంద్రం వెంటనే ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఈ కిట్లను, యన్-95 మాస్క్‌లను పెద్ద మొత్తంలో సేకరిస్తున్నప్పటికి ఎక్కువ ధరకు కొనవలసి వస్తుందని తెలిపారు. అదే కేంద్రం అందిస్తే రాష్ట్రంపై భారం తగ్గుతుందని ఈటెల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment