పట్నా: కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబే పోలీసులపైకి ఎదురుదాడికి దిగారు. బిహార్‌లోని బక్సర్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో పోలీసులపై తన ప్రతాపానన్ని చూపించారు. ఓ ఘటన నిమిత్తం బీజేపీ కార్యకర్తపై కేసు నమోదు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. బీజేపీ కార్యకర్తను గుండా అని పిలువాలని నీకు ఎవరు చెప్పారని పోలీసుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండా అంటూ పార్టీ కార్యకర్తకు ఎలా నోటీసులు ఇచ్చావని నిలదీశారు. మంగళవారం జరిగిన జనతా దర్బార్ సమావేశంలో తన దృష్టికి వచ్చిన ఈ ఘటన పట్ల మంత్రి స్పందించారు. రాష్ట్రంలో 2003 నుంచి జరిగిన అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై గుండా అంటూ పోలీసులు కేసులు పెట్టారని మంత్రి తెలిపారు. ఎవరినైనా గుండా అంటూ సంబోధించడం సరికాదు అని మంత్రి అన్నారు. కాగా గతంలో కూడా ఆయన పలుమార్లు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన కాన్వాయ్‌ని ఆపారన్న కారణంతో స్థానికులపై మంత్రి నోరుపారేసుకున్నారు. అయితే తాజాగా ఆయన పోలీసులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH Union Minister Ashwini Choubey threatens a police personnel for registering a case against a BJP party worker says, "Kisne kaha tha apko inko gunda kehne ko? Kyun gunda ka notice diya aapne?" He was holding a 'Janta Darbar'in Buxar yesterday . #Bihar pic.twitter.com/nw60sk1QwZ
— ANI (@ANI) September 24, 2019
Comments
Please login to add a commentAdd a comment