Updates..
తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా
- సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్
- 45 గంటల 32నిమిషాల పాటు నడిచిన అసెంబ్లీ
- 8 రోజుల శాసనసభ పనిదినాల్లో 59 మంది సభ్యులు మాట్లాడారు
- జీరో అవర్ లో 64మంది వారి సెగ్మెంట్ అంశాలను ప్రస్తావించారు
- ప్రభుత్వ ప్రకటనలు రెండు, మూడు బిల్లులకు ఆమోదం, ఒక లఘు చర్చ
అసెంబ్లీ ఆవరణలో మల్లా రెడ్డి చిట్ చాట్
- వీళ్ళకి మేడిగడ్డ తప్పా, వేరే గడ్డనే దొరకడం లేదు
- రోజు మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు బేజారవుతున్నారు
- మేడిగడ్డ ప్రాజెక్ట్ లీకేజ్ అయింది.. సరి చెయ్యాలి
- ఈసారీ అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ప్లాప్
- హరీష్ రావు వన్ మెన్ హీరో
- మేడిగడ్డలో రిపేర్ కాంట్రాక్ట్ పెద్ద కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే ఆయనే సరి చేస్తాడు
అన్నారం డ్యామేజిపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన
- అన్నారం డ్యామేజీపై అసెంబ్లీలో వీడియో ప్రదర్శన చేసి చూపించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- అన్నారం డ్యామేజి సీరియస్ అంశం
- మూడు బ్యారేజిలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ(ఎన్‌డీఎస్‌ఏ)కు అప్పగిస్తాం
- ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఆధారాంగానే నీళ్లు నింపాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు..
- ఉమ్మడి ఏపీలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నాం
- అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు
- కాళేశ్వరంనకు అన్నీ తానే అని చెప్పుకుంటున్నా కేసీఆర్.. ఇప్పుడు ప్రాజెక్టు డ్యామేజ్‌పైపై చర్చ కు ఎందుకు రావడం లేదు
- ఒకనాడు కేసీఆర్‌కు దేవాలయం అయిన మేడిగడ్డ.. ఇప్పుడు బొందల గడ్డ ఎలా అయింది
- ప్రాజెక్టును తొందర గా కట్టాలనే ఆతృత తప్ప..ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ గురించి పట్టించుకోలేదు.
- ప్రాజెక్టు ప్రమాదం బీఆర్ఎస్ హాయాంలోనే జరిగింది
- ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నీటి ని ఎత్తిపోసారో లెక్కలు చెప్పగలరా
హరీష్‌రావు చిట్ చాట్@అసెంబ్లీ లాబీ
- నేను అసెంబ్లీలో కీలక అంశం మాట్లాడే టైంgలో మైక్ కట్ చేస్తున్నారు
- ఫేస్ చూపించకుండా కెమెరా వేరే వైపు టర్న్ చేస్తున్నారు
- ఈ రోజు గద్దర్, అందెశ్రీ పాట పాడుతుంటే కట్ చేసారు
- నేను మాట్లాడే సమయంలో అధికార పార్టీ నేతలు స్పీకర్‌కు స్లిప్ పంపుతున్నారు
- నా డ్యూటీ విషయంలో నేను వెనక్కి తగ్గను
- నల్గొండ మీటింగ్, మేడిగడ్డ టూర్ రోజు కూడా అసెంబ్లీ కి వచ్చాను
- నిన్ననే అసెంబ్లీ క్లోజ్ చేయమని చెప్పాం
- 3 గంటలు జీరో అవర్, 3 గంటలు బీసీ బిల్లు, 2 గంటలు టీ బ్రేక్ ఇచ్చారు..
మంత్రి భట్టి మాట్లాడుతూ..
- కావాలనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారు
- రీడిజైన్ పేరుతో అంచనాలు పెంచారు
- లక్షల కోట్లు వృధా చేశారు
- హరీష్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
- ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
- కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు
- కాళేశ్వరం తెలంగాణకు కళంకంగా మారింది
- సాగునీటి మంత్రిగా హరీష్‌ను ఎందుకు తప్పించారు
- ప్రజలు నమ్మి అధికారం ఇస్తే.. పదేళ్లు పాలించి నిండా ముంచారు
- ఈ పాపాలన్నింటికి హరీష్, కేసీఆరే కారణం
- తెలంగాణను చెదలు పట్టించారు
- హరీష్ మారాడు అనుకున్నా.. కానీ ఇంకా దిగజారాడు
- చేవెళ్లపై గతంలో సబితక్క(సబితాఇంద్రారెడ్డి) ధర్నా చేశారు
- ఇప్పుడు సబితక్క మాట్లాడకుండా హరీష్‌ను సమర్థిస్తున్నారు
- చేవెళ్ల ఎండిపోయినా వారికి కనిపించదు
- కడియం కూడా మంచోడే.. కానీ, ఆ స్కూల్‌లో చేరాక అలా తయాయ్యాడు
- అది వాళ్ల బడి.. అందులో చేరగానే సిలబస్ మారిపోతుంది
- కూలిన ప్రాజెక్టులు చూసి సిగ్గుపడండి
- విచారణకు వెళ్లి తప్పు ఒప్పుకుని రండి
మంత్రి జూపల్లి మాట్లాడుతూ..
- మాటలతో ప్రజల్ని నమ్మించలేరు
- గట్టిగా మాట్లాడినంత మాత్రానా అబద్ధాలు నిజాలు అయిపోవు
హరీష్‌రావు మాట్లాడుతూ..
- సీఎం మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు
- సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించాం
- మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదుకే
- క్షమాపణ చెప్పాల్సింది కాంగ్రెస్
- గతంలో దేవాదుల పైపులు, పగిలాయి.. టెన్నెల్స్ కూలాయి
- మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరించాం.. చెరువులు తెగిపోవడం తగ్గింది
- ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది
- మాపై కోపం ఉన్నా ఫర్వాలేదు.. రైతులకు అన్యాయం చేయొద్దు
- కేసీఆర్ చేసిన పనిని చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశం
మేడిగడ్డ.. కేసీఆర్ ఆలోచనే: సీఎం రేవంత్‌రెడ్డి
- కేసీఆర్ వేసిన నిపుణుల కమిటీయే ప్రాణహిత-చేవెళ్ల సాధ్యమని నివేదిక ఇచ్చింది
- మేడిగడ్డ కట్టాలన్నది కేసీఆర్‌ఆలోచన
- అక్కడే కట్టాలని కేసీఆర్ ఆదేశించారు
- వాళ్లు నియమించుకున్న ఇంజనీర్ల కమిటీతో నివేదిక ఇప్పించుకున్నారు
- వాళ్లు కూడా తుమ్మడిహట్టి దగ్గరే నిర్మించాలని చెప్పారు
- మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీయే చెప్పింది
- హరీష్‌రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
- ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది
- తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగింది
- తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే
- పార్లమెంట్‌లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు?
- పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే
- గోదావరి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం కమిటీ వేసింది
- ఆ కమిటీ నివేదిక ఇచ్చింది
- ఆ నివేదికలోని వివరాలనే ఇప్పుడు సభ ముందు ఉంచుతున్నాం
- ప్రాజెక్టులపై వాస్తవాలను ఉత్తమ్ బయటపెట్టే యత్నం చేస్తున్నారు
- ప్రతిపక్షం సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఎదురుదాడి చేస్తోంది
- వాస్తవాలను కూడా తప్పుల తడక అని చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు
- తప్పు ఒప్పుకోండి.. కప్పి పుచ్చుకోకండి
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..
- ఉమ్మడి రాష్ట్రం కంటే తెలంగాణ వచ్చాకే కృష్ణా జలాల్లో ఎక్కువ దోపిడీ జరిగింది
- హరీష్‌రావు అన్నీ అబద్ధాలే చెబుతున్నారు
- గోబెల్స్ హరీష్‌రావు అని పేరు పెట్టుకోండి
- పదేపదే అబద్ధాలు చెప్పడం మానుకోండి
హరీష్‌రావు మాట్లాడుతూ..
- ఉత్తమ్ మాట్లాడిన ప్రతీసారీ అబద్ధాలే చెబుతున్నారు
- అవినీతి ఆరోపణలపై ఏ విచారణకైనా సిద్ధం
- కాంగ్రెస్ హయాంలోనే అవినీతి.. అన్యాయం జరిగిందని కవులు, కళాకారులు గొంతెత్తి పాడారు
- ప్రాణహిత చేవెళ్లను మేం మార్చాలనుకోలేదు
- ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు గనుకే రీ డిజైనింగ్ చేశాం
- ఎస్‌ఆర్‌ఎసీ-2కి నీళ్లు ఇచ్చిన ఘనత మాది
- తెలంగాణ ఏర్పాడ్డాక.. భూగర్భ వనరులు పెరిగాయి
- తెలంగాణ రాష్ట్రం వచ్చాక వలసలు తగ్గాయి
- ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు
- అవినీతి ఆరోపణలపై ఏ ఎంక్వైరీకైనా రెడీ
మంత్రి భట్టి మాట్లాడుతూ..
- మేడిగడ్డ పిల్లర్ నిట్టనిలువునా చీటింది
- కాళేశ్వరంలో నాణ్యత లేదు
- మేడిగడ్డ ఒక్కటే కాదు..మిగతా రెండూ నాణ్యత లేవని NDSA తేల్చింది
- రూ.94 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టు కూలిపోతోంది
- గత గవర్నర్ హరీష్‌రావుకు కాళేశ్వరరావు అని పేరు పెట్టారు
- ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్ల అవినీతి జరిగింది.. ఆ విషయం కాగ్ కూడా చెప్పింది
- ఉత్తమ్ చెప్పిన విషయాల్ని నిజమని ఒప్పుకోండి
- కూలిన దానికి తప్పు ఒప్పుకోండి
- ఇంకా సమర్థించుకోవడం సరికాదు
ఇరిగేషన్‌పై వాడీవేడి వాదనలు
- ఇరిగేషన్ శ్వేత పత్రంపై శాసన సభలో మాటల యుద్ధం
- మేడిగడ్డ లోపాలతో విపక్షాన్ని కార్నర్ చేసిన అధికార పక్షం
- తప్పుమీదంటే మీదంటూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విమర్శలు
- లేచి బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డ మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణాజలాల విషయంలో అన్నీ సక్రమంగా చేశామని అంటున్నారు: మంత్రి జూపల్లి
- మరి స్మితా సబర్వాల్ లేఖ సంగతి ఏంటి?: మంత్రి జూపల్లి
మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ..
- హరీష్‌రావు చెప్పిందే పదే పదే చెబుతున్నారు
- కేసీఆర్, జగన్ చాలాసార్లు నీటివాటాపై చర్చింఆరు
- అపెక్స్ కమిటీలో అభ్యంతరం చెబితే రాయలసీమ ప్రాజెక్టు ఆగేది
శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం
- తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే యత్నం చేస్తున్నారు
- ప్రాజెక్టులు అప్పగించాలన్న గెజిట్ నొటిఫికేషన్‌ను మేం వ్యతిరేకించాం
- మళ్లీ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి దిగింది
- ఎన్నికల ప్రచారంలో గోబెల్స్‌ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
- కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు
- ఆయకట్టు విషయంలో రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పారు
- రూ.775 కోట్లు ఖర్చు పెట్టి ఎల్లంపల్లి, మిడ్ మానేరు పూర్తి చేశాం
- సభను ఉత్తమ్ తప్పుదోవ పట్టించే యత్నం చేశారు
హరీష్‌రావు మాట్లాడుతూ..
- ఇరిగేషన్‌పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉంది
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉంది
- మంత్రి ఉత్తమ్ సత్యదూరమైన మాటలు చెప్పారు
- గత ప్రభుత్వంపై బుదర చల్లాలనే శ్వేత పత్రం ప్రవేశపెట్టారు
- మిడ్‌మానేరు ప్రాజెక్టులను మా హయాంలోనే పూర్తి చేశాం
- ఇరిగేషన్‌పై చర్చకు 2గం. సమయం అవసరం
మంత్రి ఉత్తమ్ ప్రసంగం అనంతరం.. తన సీట్లోంచి లేచి మాజీ సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
సభలో మంత్రి ఉత్తమ్..
- లక్షా 81వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై గత ప్రభుత్వం ఖర్చు చేస్తే 15లక్షల ఎకరాలకు నీళ్లు మాత్రమే అందించారు
- రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతానికి 54వేల కోట్లు ఖర్చు చేసి 57లక్షల ఆయకట్టు సాగునీరు అందించింది అప్పటి ప్రభుత్వం
- కాళేశ్వరం పరిధిలోని బ్యారేజీలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కు అప్పగించి విచారణ చేయిస్తాం
- మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పై విచారణ NDSA రిపోర్ట్ తో చర్యలు తీసుకుంటాం
- గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేం సవరిస్తాం
- ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 7లక్షల ఆయకట్టు ఏర్పాటు చేస్తాం
సభలో మంత్రి ఉత్తమ్..
- గత ప్రభుత్వం ఇరిగేషన్ పై బడ్జెట్ కేటాయింపులు కాకుండా 84వేల కోట్ల నిదులు లోన్స్ రూపంలో తెచ్చారు.
- అప్పులు వడ్డీల భారంతో రాబోయే పదేళల్లో రూ. 1లక్ష 35వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
సభలో మంత్రి ఉత్తమ్..
- కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్లానింగ్.. డిజైన్ లోపం ఉంది
- ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులన్నీ గోదావరి పాలు అయ్యాయి
- కాళేశ్వరం ప్రాజెక్టు నిషేదిత ప్రాంతంగా ఉండేది
- మేడిగడ్డ కుంగుబాటు బాటు వల్ల మిగతా బ్యారేజీల పరిస్థితి ప్రశ్నర్ధకంగా మారింది
- ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డగోలుగా అవినీతి జరిగింది
సభలో మంత్రి ఉత్తమ్..
- కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారింది
- ఎస్సారెస్సీ పునరుజ్జీవన ప్రాజెక్టుతో ఒరిగిందేం లేదు
- గతంలో పోలిస్తే.. ఎకరాకు 12 రెట్లు ఖర్చు పెరిగింది
- ఆర్థిక క్రమశిక్షణతో ప్రాజెక్టులను నిర్వహించాలి
- అంతేకానీ అడ్డగోలు అవినీతి, నిర్లక్ష్యంతో కాదు
సభలో మంత్రి ఉత్తమ్..
- గత పదేళ్లలో ప్రాజెక్టుల కోసం అనాలోచితంగా ఖర్చు చేశారు
- ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అన్ని ప్రాంతాలకు నష్టం జరిగింది
- తెలంగాణకు రావాల్సిన నీటిని సాధించుకోవడంలో బీఆర్‌ఎస్ విఫలమైంది
- గతంలో.. అపెక్స్ కమిటీ మీటింగ్ గత సీఎం కూడా పాల్గొన్నారు
- అప్పుడే కేఆర్‌ఎంబీకి నోటిఫికేషన్‌ను కేంద్రం రిలీజ్ చేసింది
- కానీ, అప్పటి ప్రభుత్వం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు
- కేఆర్‌ఎంబీకి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాచింయింది
- కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ సూత్రప్రాయంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వంనిర్ణయం తీసుకుంది
సభలో మంత్రి ఉత్తమ్..
- గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏపీ యధేచ్ఛగా నీటిని వాడుకుంది
- కృష్ణా జలాలను ఏపీ యధేచ్ఛగా దారి మళ్లించుకుంది
- తెలంగాణ వాటా 68 శాతం ఉంటే.. గత ప్రభుత్వం 50 శాతం మాత్రమే అడిగింది
- పోలింగ్ రోజు సాగర్ నుంచి అదనపు నీటిని తీసుకుంది
- బీఆర్‌ఎస్ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది
- శ్రీశైలం నుంచి అదనపు నీటిని ఏపీవాడుకుంటున్నా.. బీఆర్‌ఎస్ అప్పుడు పట్టించుకోలేదు
సభలో మంత్రి ఉత్తమ్..
- కుంగిన ప్రాజెక్టులలో నీళ్లు నింపొద్దని ఎన్‌డీఎస్‌ఏ చెబుతోంది
- ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది
- ఏపీకి నీళ్లను కట్టబెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసింది
- బీఆర్‌ఎస్ నిర్ణయాలు.. తెలంగాణను నట్టేటా ముంచాయి
- ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదు
సభలో మంత్రి ఉత్తమ్..
- కాళేశ్వరం ఆర్థికంగా అనుకూలమైనది కాదు
- మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అవసరం అయ్యే కరెంట్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కరోజే అవసరం
- మల్లన్న సాగర్ విషయంలో గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది
- కానీ, కాగ్ అనేక లోపాలు బయటపెట్టింది
- మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది
- చిన్నపాటి భూకంపాలు వచ్చినా మల్లన్నసాగర్ తట్టుకోలేదు
- మల్లన్న సాగర్ కింద గ్రామాలు ప్రమాదంలో ఉన్నాయని కాగ్ పేర్కొంది
సభలో మంత్రి ఉత్తమ్..
- కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమని గత ప్రభుత్వం చెప్పుకుంది
- కానీ, కాగ్ కాళేశ్వరం విషయంలో విస్తూపోయే విషయాలు కాగ్ చెప్పింది
- కరెంట్ కోసం ఏడాదికి రూ.10 వేల కోట్ల ఖర్చు అవుతుంది
- డీపీఆర్ అఫ్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు కట్టబెట్టింది
- కాగ్ సూచించిన అంశాల పై ఖచ్చితంగా విచారణ చేస్తాం
- గతంలో జరిగిన వేల కోట్ల పనులను పక్కన పెట్టి రీ డిజైన్ పేరుతో ప్రాజెక్ట్ లను కొనసాగించారు
- మెట్టప్రాంతాలకు నీరు ఇవ్వాలన్నది ప్రాణహిత చేవెళ్ల లక్ష్యం
- ప్రాణహిత చేవెళ్ల కింద రూ. 81వేల కోట్ల ప్రాజెక్టును సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వఅవినీతి వల్ల రూ.1లక్ష 47వేల కోట్ల అంచనాలకు పెరిగింది
సభలో మంత్రి ఉత్తమ్..
- అవినీతి, నిర్లక్ష్యం, నాసిరకం వల్లే ఈ పరిస్థితి
- మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం ,సుంధిళ్ళ బ్యారేజ్ ల నిర్మాణం లో క్వాలిటీ లేదు
- అన్నారంకు క్రాక్స్ వచ్చాయి
- అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉంది
- అన్నారం బ్యారేజీలో నిన్నటి నుంచే లీకులు మొదలయ్యాయి
- వెంటనే ఎన్‌డీఎస్‌ఏకి సమాచారం అందించాం
- నీటిని నింపొద్దని ఎన్‌డీఎస్‌ఏ చెబుతోంది
- ఉన్న నీటిని తొలగించమని చెప్పింది
సభలో మంత్రి ఉత్తమ్..
- మేడిగడ్డ ప్రాజెక్టు బాగా దెబ్బ తింది
- మేడిగడ్డ పనికి రాదు అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది
- అక్టోబర్‌లో మేడిగడ్డ కుంగితే కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించలేదు
- అవినీతి, నిర్లక్ష్యం వల్ల బ్యారేజ్ బాగా దెబ్బతింది
- గత ప్రభుత్వ పెద్ద మనిషే చీఫ్ ఇంజనీర్.. డిజైనర్
- గత పదేళ్లలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతి మరెక్కడా జరగలేదు
- ఇంత అవినీతి స్వతంత్ర భారతంలో ఇప్పటిదకా జరగలేదు
- యావత్ తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ క్షమాపణలు చెప్పాలి
- నేషనల్ డ్యామ్ సేఫ్టీపై విచారణ జరిపించాలని కోరాం
నీటి పారుదల శాఖ పై శ్వేత పత్రం
- 2014 వరకు నీటి పారుదల సామర్థ్యం 57.79లక్షల ఎకరాలు
- మొత్తం ఖర్చు 54,234కోట్లు
- 2014 వరకు ఓక్కో ఎకరానికి 93 వేల కోట్ల ఖర్చు
- 2014 నుంచి 23 వరకు ఇరిగేషన్ ఖర్చు 1.81లక్షల కోట్లు
- కొత్త ఆయకట్టు 15.81లక్షల ఎకరాలు
- ఒక్కో ఎకరం ఖర్చు 14.45లక్షలు
సభలో కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ పపవర్ పాయింట్ ప్రజెంటేషన్..
- ఇరిగేషన్ ప్రాజెక్టులపై పూర్తి అవగాహన కోసమే పవర్‌పాయింట్ ప్రజంటేషన్
- సభ్యులకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం
- కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక ప్రాజెక్టు
- కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ గుండెకాయలాంటిది
- మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలున్నాయ్
- అవగాహన లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారు
- మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయింది
- వందేళ్లు ఉండాల్సిన బ్యారేజ్.. దురదృష్టవశాత్తూ నాణ్యతా లోపంతో మూడేళ్లకే దెబ్బతింది
- రూ.1,800 కోట్లకు టెండర్ పిలిచి.. నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు
- ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయారు
- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నివేదిక ఇచ్చింది
- ప్రాజక్టు నిర్మాణం నాసికంగా ఉందని పేర్కొంది
అసెంబ్లీ స్పీకర్
- అన్ని రికార్డులను పరిశీలించి టెక్నీషియన్ ను సభలోకి అనుమతించా
- గతంలో సీఎం గా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సభలోనే టెక్నీషియన్ ఉన్నాడు
- నేను టెక్నీషియన్ కు అనుమతి ఇస్తున్నా..నన్ను ఎవరూ ప్రశ్నించొద్దు
మంత్రి శ్రీధర్ బాబు..
- గతంలో సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం,టెక్నీషియన్ ద్వారా నే ఇచ్చారు
- స్పీకర్ అనుమతి తోనే టెక్నీషియన్ సభ లోపలికి వచ్చారు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు..
- మెంబర్ కాకుండా సభలోకి ఇతరులు రాకూడదు
- అడ్వకేట్ జనరల్ తప్ప మరో వ్యక్తి రావోద్దు
- టెక్నీషియన్ ను సభలోకి అనుమతించ వద్దు
- మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి
- టెక్నీషియన్ ను బయటకు పంపాలి
ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేత పత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్
- అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
- కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం
- కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు అందరికి ధన్యవాదాలు.
- మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాం.
- మాజీమంత్రి గంగుల కమలాకర్ తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయం.
- ఆ మాజీమంత్రికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సకల జనుల సర్వేను బయటపెట్టమని అడిగారా?
- అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే జరిపిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకోవాలి.
- మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం వరకు మేము ఉన్నాం.
- మిగతా వారిలాగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే మేము పరిమితం కాలేదు. అందుకే సభలో తీర్మానం పెట్టాం.
- ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తాం
►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది.
►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది.
►నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది.
►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న కాంగ్రెస్ సర్కార్.
►సభలో నీటి పారదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం
►పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసిన అధికారులు
►ఇప్పటికే KRMBపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
►ఈ క్రమంలో తమకు కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్
►నిన్న జరగాల్సిన ఇరిగేషన్‌పై చర్చ నేటికి వాయిదా
►ఇవ్వాల్టితో ముగియనున్న తెలంగాణ శాసన సభ సమావేశాలు
►ఇప్పటికే శాసన మండలి నిరవధిక వాయిదా.
Comments
Please login to add a commentAdd a comment