రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌.. హైలైట్స్‌ ఇవే | Telangana Budget 2026 27 Updates | Sakshi
Sakshi News home page

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్‌.. హైలైట్స్‌ ఇవే

Mar 20 2026 10:11 AM | Updated on Mar 20 2026 3:11 PM

Telangana Budget 2026 27 Updates

👉తెలంగాణ బడ్జెట్ హైలైట్స్‌

  • ఆరు గ్యారెంటీలకు రూ.50713 కోట్లు కేటాయింపు
  • సంక్షేమం - అభివృద్ధికి రూ.145592 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా – ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కవరేజ్
  • విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొత్తగా అమలు
  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్‌ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం
  • దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
  • జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ – 3 కార్పొరేషన్లు
  • హైదరాబాద్‌కు “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణం
  • CURE–PURE–RARE మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి
  • రైతులకు సోలార్ పంపు సెట్లు – 100 శాతం సబ్సిడీ
  • భూ భారతి చట్టం–2025 అమలు
  • AI ఆధారిత ‘భూ మిత్ర’ చాట్‌బాట్ ప్రవేశపెట్టడం
  • ప్రజావాణి కార్యక్రమం – నేరుగా ఫిర్యాదుల స్వీకరణ
  • ప్రజాపాలన-ప్రగతి 99 రోజుల ప్రోగ్రాం
  • సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం ప్రారంభం
  • రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డులు -ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్
  • సమగ్ర ప్రమాద బీమా పథకం ప్రభుత్వ ఉద్యోగులకు
  • మహిళా ఎస్‌హెచ్‌జీలకు బస్సులు, పెట్రోల్ బంకులు
  • 274 మొబైల్ అంగన్‌వాడీలు ఏర్పాటు - 500 అంగన్‌వాడీ-కమ్-క్రెచ్ సెంటర్లు
  • గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు (రూ.500 కోట్లు)
  • మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ - మెట్రో ఫేజ్-II, III విస్తరణ
  • ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, ఛార్జింగ్ స్టేషన్లు
  • డ్రగ్స్ నియంత్రణకు EAGLE ప్రత్యేక దళం ఏర్పాటు

👉ఉద్యోగులకు నగదు రహిత వైద్యం
నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించిన ప్రభుత్వం
ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని ప్రకటన
ప్రభుత్వాస్పత్రులతో పాటు 421 ఎంపానల్డ్ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం అమలు చేయనున్న ప్రభుత్వం
రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు కానున్న ఈ పథకం ద్వారా 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం
ఈ పథకం కింద మొత్తం 1,998 వ్యాధులకు నగదు రహిత చికిత్స అందిస్తామని పేర్కొన్న ప్రభుత్వం

Telangana Budget: రూ. 3.24 లక్షల కోట్ల బడ్జెట్ ఏ శాఖకు ఎంతంటే..!

👉తెలంగాణ వార్షిక బడ్జెట్‌.. కేటాయింపులు ఇలా.. 

  • రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు
  • జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం
  • వ్యవసాయం-రూ.23,179 కోట్లు
  • విద్యుత్‌శాఖ-రూ. 21,285 కోట్లు
  • విద్యాశాఖ-రూ.26,674 కోట్లు
  • మహిళ, శిశు సంక్షేమం-రూ.3143 కోట్లు
  • పశుసంవర్థకశాఖ-రూ.1,529 కోట్లు
  • సివిల్‌ సప్లై-రూ.7,366 కోట్లు
  • వైద్యారోగ్యశాఖ- రూ.13,679 కోట్లు
  • రాజీవ్‌ యువవికాసం- రూ. 6000 కోట్లు
  • ఎస్సీ అభివృద్ధి- రూ.11784 కోట్లు
  • ఎస్టీ అభివృద్ధి రూ.7937 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం- రూ.3769 కోట్లు
  • ఇరిగేషన్ -రూ.22615 కోట్లు
  • మున్సిపల్ శాఖ- రూ.17907 కోట్లు
  • గృహ నిర్మాణం- రూ.7430 కోట్లు
  • ఐటీ- రూ.875 కోట్లు
  • చేనేత- రూ.258 కోట్లు
  • పరిశ్రమలు- రూ. 3490 కోట్లు
  • పంచాయతీ రాజ్- రూ.33688 కోట్లు
  • ఆర్‌అండ్‌బీ - రూ.12789 కోట్లు
  • న్యాయ శాఖ- రూ.2367 కోట్లు
  • హోంశాఖ- రూ. 121907 కోట్లు
  • టూరిజం- రూ. 1224 కోట్లు
  • గోదావరి పుష్కరాలు -రూ.500 కోట్లు
     
     బహిరంగ మార్కెట్ రుణాలు(అప్పుల రుపం లో)-80 వేల కోట్లు
    కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు
    ద్రవ్య లోటు- 58458కోట్లు
    ప్రాథమిక లోటు -37154
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే 43 వేల కోట్ల అదనపు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
    అప్పుల చెల్లింపు -23024
    భూముల అమ్మకం ,ఇతర మార్గాలు -35730
    వడ్డీ లేని రుణాలు డ్వాక్రా మహిళలకు 2500 కోట్లు
    ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం 350 కోట్లు
    పంచాయతీ రాజ్ రోడ్లకు‌‌ 2622 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు,
    చేయుత పెన్షన్లకు రూ.14,861 కోట్లు
    కొత్తగా 2 లక్షల మంది అర్హులకు చేయుత పింఛన్లు మంజూరు
    పంచాయతీ రాజ్ హమ్ రోడ్లకు రూ.1372 కోట్లు
    కనస్ట్రషన్ అఫ్ రూరల్ రోడ్లు‌‌కు రూ.750 కోట్లు
    మెయిటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ రూ.500 కోట్లు
    కేంద్రంతో స్నేహపూర్వక సంబంధాలు CSS పథకాల ద్వారా భారీగా నిధుల సమీకరణ
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 7,072 కోట్లు సాధన
    2021-22లో రూ.4,826 కోట్లు పొందిన రాష్ట్రం
    నిధుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ పెరుగుదల

బడ్జెట్‌లో విద్యకు 8.22 శాతం కేటాయింపు

ప్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీం
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం
వెల్ఫేర్ విద్యాసంస్థల్లో వంటగదుల ఆధునీకరణకు 100 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీ కి 1000 కోట్లు
2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి 400 కోట్లు
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లో ట్రైనీ లకి నెలకు 2000 స్కాలర్ షి

👉ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 4,18,931

  • తెలంగాణ వృద్ధి రేటు 10.2 శాతం
  • దేశ తలసరి ఆదాయం రూ. 2,19,575
  • దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.9 రెట్లు ఎక్కువ
  • ప్రస్తుతం 200 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యం: భట్టి
  • 2047 నాటికి 3 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిద్ధడమే లక్ష్యం

 

👉ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..
ATCలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్ షిప్..

👉తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

👉ముగిసిన కేబినెట్ సమావేశం
రాష్ట్ర బడ్జెట్‌ను ఆమోదించి గవర్నర్‌కు పంపిన కేబినెట్

👉అసెంబ్లీలో పాము కలకలం..

  • అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పాము ను పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..
  • పాము ను ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన ట్రాఫిక్ పోలిస్..

👉బడ్జెట్‌ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిన ఉన్నతాధికారులు
  • నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన భట్టి విక్రమార్క

👉మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బడ్జెట్‌

  • అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

  • మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్‌

  • రూ.3.35 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం

👉బడ్జెట్‌ ముందు ఉదయం ప్రజాభవన్‌లోని పోచమ్మ ఆలయంలో భట్టి దంపతులు ప్రత్యేక పూజలు
👉ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకోనున్న భట్టి..
👉మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, సీఎంను మర్యాదపూర్వకంగా కలుస్తారు.
👉అనంతరం బినెట్‌ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రవేశ పెడతారు.
👉అదే సమయంలో శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పిస్తారు.  

👉ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3.35 లక్షల కోట్ల వరకు అంచనాలతో ప్రతిపాదనలను శుక్రవారం అసెంబ్లీ ముందుంచనున్నట్టు తెలుస్తోంది. ఆరు గ్యారంటీల అమలుకు తోడు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశలో వీటిని ఖరారు చేసినట్టు సమాచారం.

👉స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరుతాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్తగా ఆరు పథకాలను ప్రతిపాదిస్తూ, 2034 నాటికి నిర్దేశించుకున్న విజన్‌కు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement