నిరసన కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి, గీతారెడ్డి, సునీతారావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు గౌరవించే భారత రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానపరచడం దుర్మార్గమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. దీనిపై దేశ ప్రజలు, జాతికి కేసీఆర్ తక్షణమే క్షమాపణలు చెప్పా లని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆదివారం మహిళాకాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, నివాళులు అర్పించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ అందరికీ ఓటుహక్కు, మహిళలకు సమానహక్కు, భావ ప్రకటనాస్వేచ్ఛ కల్పించిన రాజ్యాంగాన్ని మార్చాలా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌ను దేశ ప్రజలు క్షమించబో రని వ్యాఖ్యానించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి మాట్లాడుతూ.. తెలం గాణ రాష్ట్రంగానీ, కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి గానీ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే వచ్చిందని గుర్తుపెట్టుకోవాలన్నారు. కొత్త రాజ్యాం గం పేరిట ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహిళానేత సునీతారావు డిమాండ్ చేశారు.
రాజకీయ సభగా సమతామూర్తి ప్రతిష్టాపన
రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్టాపనను బీజేపీ రాజకీయసభగా మార్చిందని మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రధాని హోదాలో వచ్చారో, బీజేపీనేత హోదాలో వచ్చారో అర్థంకాలేదన్నారు. మోదీ పర్యటన ఆసాంతం బీజేపీ కార్యక్రమంలా సాగిందన్నారు. సమతామూర్తి స్ఫూర్తిని అమలు చేయాలనుకుంటే అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని, కానీ ఉత్తరాది, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులిస్తూ, దక్షిణాదిపై వివక్ష చూపుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment