
అశ్వారావుపేట/సత్తుపల్లి: కోడి పందేలతో ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు జాతరను తలపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు సరిహద్దుకు తరలివచ్చారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, మధిర మండలాల్లో కోడి పందేలు జరిగే ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల మీదుగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించే కోడిపందేల స్థావరాలకు కూడా బయలుదేరారు.
ఇటు కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు, కాకర్ల, మల్లేల గ్రామాలు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని కొన్ని గ్రామాలకు జిల్లా వాసులు వెళ్లారు. అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండతో పాటు ఏపీకి బదలాయించిన కుక్కునూరు, వేలేరుపాడుల్లోని పామాయిల్ తోటల్లో షెడ్‌లు ఏర్పాటు చేసి ఏడాది పాటు కోళ్లను పెంచారు. వీటితో కొందరు పందెంలో పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment