సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 5 నుంచి నిర్వహించా ల్సిన ఎంసెట్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యా ర్థులు ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వాలనే యోచనతో ఎంసెట్ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, వాటిని ఆగస్టులో నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ ఎం సెట్‌ను నిర్వహించ నున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమ వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసె ట్‌తోపాటు పీజీఈ సెట్, ఈసెట్ తేదీలను మార్పు చేశారు. పదో తరగతి పూర్తయిన విద్యా ర్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో, బాసరలోని ట్రిపుల్‌ఐటీ (ఆర్‌జీ యూకేటీ)లో ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాల కోసం పాలీసెట్–2021ను వచ్చే నెల 17న నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 25తో ముగియనుంది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. అనంతరం ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్స్)ల తాజా షెడ్యూలును విడుదల చేశారు.
జూలైలో ఫైనలియర్ పరీక్షలు పూర్తి చేయండి
డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఫైనలియర్ పరీ క్షలను జూలై మొదటి వారంలో ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరగా నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు సబితా చెప్పారు. అందుకనుగుణంగానే ఫైనల్ ఇయర్ విద్యార్థుల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల పరీక్షలను కూడా జూలై నెలాఖరులోగా నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో డిగ్రీ వార్షిక పరీక్షలతో ముడిపడిన ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే (ఆగస్టులో) నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Exams: అన్నీ ‘సెట్’ చేశారు
Published Tue, Jun 22 2021 2:34 AM | Last Updated on Tue, Jun 22 2021 7:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment