CETs
-
Exams: అన్నీ ‘సెట్’ చేశారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 5 నుంచి నిర్వహించా ల్సిన ఎంసెట్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యా ర్థులు ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేందుకు సరిపడా సమయం ఇవ్వాలనే యోచనతో ఎంసెట్ పరీక్షను వాయిదా వేసింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, వాటిని ఆగస్టులో నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ ఎం సెట్‌ను నిర్వహించ నున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమ వారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసె ట్‌తోపాటు పీజీఈ సెట్, ఈసెట్ తేదీలను మార్పు చేశారు. పదో తరగతి పూర్తయిన విద్యా ర్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో, బాసరలోని ట్రిపుల్ఐటీ (ఆర్జీ యూకేటీ)లో ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో ప్రవేశాల కోసం పాలీసెట్–2021ను వచ్చే నెల 17న నిర్వహించాలని నిర్ణయించారు. దానికి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 25తో ముగియనుంది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశిం చారు. అనంతరం ఉమ్మడి ప్రవేశపరీక్ష (సెట్స్)ల తాజా షెడ్యూలును విడుదల చేశారు. జూలైలో ఫైనలియర్ పరీక్షలు పూర్తి చేయండి డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఫైనలియర్ పరీ క్షలను జూలై మొదటి వారంలో ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేయాలని యూనివర్సిటీల అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరగా నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు సబితా చెప్పారు. అందుకనుగుణంగానే ఫైనల్ ఇయర్ విద్యార్థుల బ్యాక్లాగ్ సబ్జెక్టుల పరీక్షలను కూడా జూలై నెలాఖరులోగా నిర్వహించాలని స్పష్టం చేశారు. దీంతో డిగ్రీ వార్షిక పరీక్షలతో ముడిపడిన ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే (ఆగస్టులో) నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
సెషన్‌కు సెషన్‌కు మధ్య 3 గంటలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలైలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లలో ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా పరీక్షల సమయాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేందుకు, కుర్చీలు, బెంచీలు కెమికల్‌తో శుభ్రపరిచేందుకు, ఆన్లైన్ పరీక్షలు అయినందున కంప్యూటర్, కీ బోర్డు, మౌస్ వంటివి శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో కొన్ని ఒకే సెషన్‌తో ముగియనుండగా, మరికొన్ని ఎక్కువ సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎంసెట్ పరీక్షను తీసుకుంటే 6 సెషన్లలో (ప్రతిరోజు ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్) మూడ్రోజులపాటు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే అగ్రికల్చర్ పరీక్షలను రెండు, మూడు సెషన్లలో, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి వాటికి రెండేసి చొప్పున సెషన్లలో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒక సెషన్‌కు మరో సెషన్ మధ్య 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడుతాజాగా పరీక్షల తేదీలను మార్పు చేసిన నేపథ్యంలో 3 గంటల వ్యవధి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో శానిటైజేషన్ చర్యల కోసం మధ్యలో 3 గంటల సమయం ఉండేలా ఉదయం సెషన్ పరీక్షల సమయాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
సెట్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్, ఈసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈనెల 31 నుంచి జూన్ 10 వరకు పొడిగించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. జూలైలో అన్ని ప్రవేశ పరీక్షలను నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంసెట్, ఈసెట్, పీజీఈ సెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలా సెట్, ఐసెట్, పీఈసెట్‌కు హాజరయ్యేందుకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చేనెల 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆ తరువాత ఆలస్య రుసుముతో కూడా దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
మూడు సెట్ల నోటిఫికేషన్ విడుదల
-
సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
-
సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై స్పష్టత - ఇక వరుసగా నోటిఫికేషన్లు, దరఖాస్తుల ప్రక్రియ - రేపు లేదా 13న ఎంసెట్ నోటిఫికేషన్ - 14 నుంచి ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు - రెండు మూడు రోజుల్లో మిగతా ప్రవేశ పరీక్షలపైనా స్పష్టత సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైంది. దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు తదితర ఆన్లైన్ పనులను నిర్వహించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై తలెత్తిన వివాదం పరిష్కారమైంది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సమావేశమై చర్చించారు. టెండర్లలో తక్కువ రేటు కోట్ చేసిన సర్వీసు ప్రొవైడర్‌కే పనులను అప్పగించాలని కడియం సూచించారు. దీంతో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణపైనా సెట్స్ కన్వీనర్లు కసరత్తు ప్రారంభించారు. వీటిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన జారీ చేసే అవకాశముంది. ప్రవేశ పరీక్షల తేదీల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. 15 రోజుల సమయం వృథా..! సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయంలో సెట్స్ కన్వీనర్ల కమిటీ నిబంధనలు పాటించలేదంటూ కొందరు సర్వీసు ప్రొవైడర్లు ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దానిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని, సెట్స్ కన్వీనర్ల కమిటీని వివరణ కోరింది. అయితే తాము గతంలో తరహాలోనే సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపికకు చర్యలు చేపట్టామని.. ప్రస్తుతం ఎం చేయమంటారో ప్రభుత్వమే తేల్చాలంటూ ప్రభుత్వానికి విద్యా మండలి వివరణ ఇచ్చింది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంతో.. గత నెల 27న జారీ కావాల్సిన ఎంసెట్ నోటిఫికేషన్, ఈనెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ, 4న జారీ కావాల్సిన లాసెట్ నోటిఫికేషన్ ఆగిపోయాయి. తాజాగా ఈ సమస్య పరిష్కారమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 15 లేదా 16వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈనెల 14 నుంచి చేపట్టేలా ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాష్ చర్యలు ప్రారంభించారు. షరతుతో ఆయుష్కు దరఖాస్తులు ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా, ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ రాసినా సరైన స్పందన రాలేదు. సీబీఎస్ఈ ఇంకా నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలకు ప్రకటన జారీ చేయనందున ఎంసెట్‌లో చేర్చాలని మౌఖికంగా సూచించినట్లు సమాచారం. అయితే నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలు చేపడితే విద్యార్థులు నీట్ రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.