
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నవంబర్ 25న "హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 2020-21" పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఆర్‌బీఐ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం తెలంగాణ అనేక రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తోంది. రాష్ట్రం పనితీరు జాతీయ సగటు పనితీరు కంటే కూడా మెరుగ్గా ఉంది. 2020-21 నాటికి తెలంగాణలో తలసరి విద్యుత్ లభ్యత 1,904.5 యూనిట్లు కాగా, జాతీయ సగటు 1,031.4 యూనిట్లుగా ఉంది. 2020-21లో తెలంగాణలో విద్యుత్ లభ్యత 6,699 కోట్ల యూనిట్లు అయితే, ఇంకా తెలంగాణలో కోటి యూనిట్ల కొరత ఉంది.
తెలంగాణలో ప్రాథమిక పాఠశాలల్లో(1 నుంచి 5 తరగతులు) స్థూల నమోదు నిష్పత్తి 111.9 అయితే, జాతీయ నిష్పత్తి 102.7గా ఉంది. తెలంగాణలో ఎగువ ప్రాథమిక పాఠశాలల్లో (6 నుంచి 8 తరగతులు) చదివే వారి నిష్పత్తి 97.4 కాగా, అఖిల భారత నిష్పత్తి 88.9గా నమోదు అయ్యింది. తెలంగాణలో సెకండరీ (8, 9) హయ్యర్ సెకండరీ (11, 12) తరగతుల్లో నమోదు సంఖ్య వరుసగా 88, 57.2, అయితే అదే తరగతులకు అఖిల భారత సగటులు 50.5, 51.4గా ఉంది. 2018 డేటా ప్రకారం తెలంగాణలో జననాల రేటు 1,000కు 16.9గా ఉంది. ఇది అఖిల భారత సగటు 20 కంటే గణనీయంగా తక్కువగా ఉంది. రాష్ట్రంలో 1,000 మందిలో మరణాల రేటు జాతీయ సగటు 6.2కి వ్యతిరేకంగా 6.3గా ఉంది. తెలంగాణలో శిశు మరణాల రేటు ప్రతి 1,000కి 27 కాగా, జాతీయ సగటు 32. 2014-18 మధ్య తెలంగాణలో ఆయుర్దాయం 69.6 సంవత్సరాలు భారత సగటు 69.4.
Comments
Please login to add a commentAdd a comment