నివాళులర్పిస్తున్న పల్లా వెంకట్‌రెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రావిర్భావ వేడుకలు నగరంలోని వివిధ ప్రభుత్వ, పార్టీ కార్యాలయాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయగీతం ఆలపించారు.
తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యుత్‌సౌధలో తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అమరులస్తూపం వద్ద నివాళులర్పిస్తున్న పొన్నాల, గీతారెడ్డి, భట్టి, అంజన్ తదితరులు
గాంధీభవన్‌లో జరిగిన వేడుకల్లో ఏఐసీసీ ఇన్‌చార్జి మాణిక్యంఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment