Ramappa Temple: రూ. 100 కోట్లతో అభివృద్ధి..  | Telangana Government Allot Rs 100 Crores To Develop Ramappa Temple | Sakshi

Ramappa Temple: రూ. 100 కోట్లతో అభివృద్ధి.. 

Published Thu, Jul 29 2021 8:55 AM | Last Updated on Thu, Jul 29 2021 8:55 AM

Telangana Government Allot Rs 100 Crores To Develop Ramappa Temple - Sakshi

కేంద్రానికి రాష్ట్ర సర్కార్‌ పంపిన రామప్ప ఆలయ అభివృద్ధి నమూనా చిత్రం

ఆడిటోరియం, కాటేజీలు, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు.. ఇలా రామప్ప ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా  కేంద్రానికి రాష్ట్ర సర్కార్‌ పంపిన రామప్ప ఆలయ అభివృద్ధి నమూనా చిత్రం ఇది. చరిత్రాత్మక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా ప్రకటనకు ముందు ఆలయంతోపాటు సరస్సు కట్ట, రామప్ప సరస్సు ఐలాండ్‌ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నమూనా చిత్రాలను కేంద్రానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. 

ములుగు జిల్లా వెంకటాపురం (ఎం) మండలంలోని రామప్ప ఆలయం దగ్గర ఆడిటోరియం, కాటేజీలు, సరస్సు కట్టపై శివాలయం టెంపుల్, కట్టకు రెండువైపులా గ్రీనరీ ఏర్పాటు చేయడం, ఐలాండ్‌లో భారీ శివుడి విగ్రహం, పిల్లల పార్క్, కాటేజీలను ఏర్పాటు చేయనున్నట్లు నమూనా చిత్రాలను తయారు చేసి పంపినట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు.    –వెంకటాపురం (ఎం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement