సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. పర్యాటకం అంటే హైదరాబాద్ మాత్రమే కాదని, జిల్లాల్లో ఎన్నో అద్భుత ప్రాంతాలు న్నాయన్నారు. వీటన్నింటిలో వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా పలు హోటళ్లు, ట్రావెల్స్ నిర్వాహకులు, టూర్ ఆపరేటర్లు తదితరులతో మంత్రి ఆన్‌లైన్ ద్వారా సమావేశమయ్యారు. అవార్డుల కు ఎంపికైన సంస్థల పేర్లు ప్రకటించి, అందజేసే సర్టిఫికెట్లు ప్రదర్శించారు. స్టార్ హోటళ్లలోని వివిధ కేటగిరీలు, హై దరాబాద్‌లో, రాజధాని వెలుపల తదితర విభాగాలకు సంబంధించి.. తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ, అలంక్రిత రిసార్ట్స్–స్పా, సితార, మిన ర్వా గ్రాండ్, అడోబ్, ఓపీడీఎస్‌ఎస్ హోటల్స్, రిసార్ట్స్, వివేరా హోటల్స్, ఫుడ్‌కోర్ట్‌లకు, టూర్ ఆపరేటర్లు; ట్రావె ల్ ఏజెంట్స్‌కు సంబంధించి.. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్, సదరన్ ట్రావెల్స్‌లకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment