సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాష్ట్రానికి ఉన్న వాటా నీటిని వినియోగించుకునేలా ఆర్డీఎస్ కాల్వల ఆధునికీకరణ పనులను త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ తుంగభద్ర బోర్డును కోరింది. తుంగభద్రలో రాష్ట్రా నికి 15.90 టీఎంసీల మేర నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ 5 టీఎంసీలకు మించి రావ డం లేదని దృష్టికి తెచ్చింది.
ఈ మేరకు మంగళవారం ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్ తుంగభద్ర బోర్డుకు లేఖ రాశారు. 2020–21 ఏడాదిలో ఆర్డీఎస్‌కు తుంగభద్ర నుంచి 5.15 టీఎంసీల మేర నీరు కేటా యించినా తెలంగాణకు కేవలం 1.18 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని తెలిపింది. ఈ దృష్ట్యా నిర్దిష్ట వాటా మేరకు నీటి వాటాలు దక్కేలా ఆధునికీకరణపనులు చేయించాలని కోరింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం అటు తుంగభద్ర నీటిని, ఇటు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని యథేచ్చగా వినియోగిస్తోందని దృష్టికి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment