సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు బతుకమ్మ, దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. 13 నుంచి 25 వరకు అంటే 13 రోజుల పాటు బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
రాష్ట్రంలోని అన్ని రకాల స్కూళ్లు ఈ సెలవులను పాటించాలని విద్యాశాఖ సూచించింది. ఇంటర్మీడియట్ కాలేజీలు మాత్రం 19 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో అక్టోబర్ 6 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
చదవండి: బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఖాయం: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment