కౌలురైతుల రక్షణ అంశంపై అఖిలపక్ష సమావేశం కూడా..
సామాజిక, పౌర సంస్థల ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో సీఎం రేవంత్
రైతు భరోసా ఎవరెవరికి అందాలన్నది తేల్చాల్సి ఉందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా రంగంపై (ఎడ్యుకేషన్) కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వారి సంక్షేమం, వ్యవసాయరంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందని తెలిపారు.
శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజాహిత కార్యక్రమా లు చేపట్టిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకా రం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నా మన్నారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా నాలుగు గ్యా రంటీలను అమలు చేశామ ని.. రైతులు, నిరుద్యోగుల కు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు.
అసలైన అర్హులకు అదనపు సాయం!
కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమా వేశం నిర్వహిస్తామని.. ప్రత్యేక చట్టం తీసుకురా వాలనే ఆలోచన ఉందని రేవంత్ చెప్పారు. రైతు భరోసా అనేది రైతులు పంటలు వేసేందుకు అందించే పెట్టుబడి సాయమని.. అది ఎవరికి ఇవ్వాల న్న దానిపై విస్తృత చర్చ జరగాలని పేర్కొన్నారు. నిస్సహాయులకు, అసలైన అర్హులకు చెప్పిన దాని కంటే ఎక్కువ సాయం చేయాలనేది తమ ఆలోచన అని రేవంత్ చెప్పారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. పంట మార్పి డికి, అన్ని పంటల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాల్సి న అవసరం ఉందని చెప్పారు.
రాష్ట్రంలో పాఠశా లలు, విద్యాలయాలను మెరుగుపర్చేందుకు ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలి పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా.. దాదాపు 25 ఎకరాల్లో ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లుగా ఏర్పాటు చేస్తామని, దీనితో కుల, మత వివక్ష కూడా తొలగుతుందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కొడంగల్‌లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతామని, దశలవారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని తెలిపారు. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ మరింత సమర్థంగా జరిగేలా చూస్తామన్నారు. నిరుద్యో గులకు ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు. సీఎంను కలసిన వారిలో ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హర గోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, రమ మేల్కొటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదె ఇన్నయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment