సాక్షి, హైదరాబాద్: తమ అనుమతి లేకుండా ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని పురాతన భవనాలను కూల్చడానికి వీల్లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవనాల పటిష్టతపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో ఐఐటీ హైదరాబాద్ విభాగం డైరెక్టర్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) హైదరాబాద్ విభాగం అధిపతి లేదా ఆయన సూచించిన అధికారిని కూడా కమిటీలో సభ్యులుగా నియమించాలని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో చారిత్రక పురాతన హెరిటేజ్ కట్టడాలను కూల్చివేయకుండా ఆదేశించాలని కొందరు, పురాతన భవనాలను కూల్చి నూతన భవనాలను నిర్మించేలా ఆదేశించాలంటూ మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment