సాక్షి, హైదరాబాద్: తమను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలన్న ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతానికి అదే కాలేజీలో తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దని ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడం కోసం ప్రతివాదులకు రెండు వారాలు గడువు ఇచ్చింది.
తొలుత రద్దు చేసిన ఎంబీబీఎస్, పీజీ అనుమతిని.. తిరిగి పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ డా.నల్లమాడి శశిధర్‌రెడ్డి సహా మరో 17 మంది హైకోర్టును ఆశ్రయించారు. తమను ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేసేలా ఆదేశించాలని కోరారు. వసతులు, అధ్యాపకులు లేరని తొలుత ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ అనుమతిని కూడా మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు రద్దు చేసిందని, తర్వాత మళ్లీ పునరుద్ధరించారని.. ఇది సరికాదన్నారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. విద్యార్థులే ఆ కాలేజీని ఎంపిక చేసుకొని ఇప్పుడు అధికారులు గుర్తించిన తర్వాత అభ్యంతరం తెలపడం సరికాదంది. ఆ కాలేజీలోనే తరగతులకు హాజరుకావాలంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment