MNR Medical College
-
క్లాసులకు హాజరుకండి
సాక్షి, హైదరాబాద్: తమను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేయాలన్న ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రస్తుతానికి అదే కాలేజీలో తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దని ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడం కోసం ప్రతివాదులకు రెండు వారాలు గడువు ఇచ్చింది. తొలుత రద్దు చేసిన ఎంబీబీఎస్, పీజీ అనుమతిని.. తిరిగి పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ డా.నల్లమాడి శశిధర్‌రెడ్డి సహా మరో 17 మంది హైకోర్టును ఆశ్రయించారు. తమను ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేసేలా ఆదేశించాలని కోరారు. వసతులు, అధ్యాపకులు లేరని తొలుత ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, పీజీ అనుమతిని కూడా మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు రద్దు చేసిందని, తర్వాత మళ్లీ పునరుద్ధరించారని.. ఇది సరికాదన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. విద్యార్థులే ఆ కాలేజీని ఎంపిక చేసుకొని ఇప్పుడు అధికారులు గుర్తించిన తర్వాత అభ్యంతరం తెలపడం సరికాదంది. ఆ కాలేజీలోనే తరగతులకు హాజరుకావాలంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. -
మనోవేదనతో మెడికో ఆత్మహత్య
వరంగల్ అర్బన్: హైదరాబాద్ ఎంఎన్ఆర్ కాలేజిలో వరంగల్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ పుప్పాలగుట్టకు చెందిన విద్య హైదరాబాద్‌లోని ఎంఎన్ఆర్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు పాత సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దీంతో మనోవేదనతో ఆమె తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో ప్రవేశాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో ఈ ఏడాది ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. వైద్య సీట్ల భర్తీకి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. భారత వైద్య మండలి (ఎంసీఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఎంఎన్ఆర్ కళాశాలలోని జూనియర్ వైద్యుడికి అర్హతలు లేవని తేలడంతో కళాశాలకు అనుమతి ఇవ్వలేదని, అయినా ప్రవేశాలను చేపట్టిందని భారత వైద్య మండలి తరపు న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. దీనిపై వైద్యకళాశాల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ స్పందిస్తూ... ఎంఎన్ఆర్ వైద్య కళాశాలలో లోపాలు లేవని పేర్కొన్నారు. సీట్ల భర్తీకి ఎంసీఐ అనుమతిని నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సంప్రదించగా.. అనుమతి ఇచ్చిందన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రవేశాలు నిర్వహించినట్టు వివరించారు. జూనియర్ వైద్యుడి అర్హత విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఎంసీఐకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాదికి ఎంఎన్ఆర్ కాలేజీలో ప్రవేశాలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.