
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. గత ఆరేళ్లుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాసేపట్లో జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి బెంచ్ తీర్పు వెలువరించనుంది.