సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కోడెలు పక్కదారి పడుతున్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఆందోళన చేపట్టారు.
మంత్రి సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. రైతులకు కేవలం రెండు, మూడు కోడెలు అప్పగించి, మంత్రి సిఫారసుతో రాంబాబు అనే వ్యక్తికి ఏకంగా 49 కోడెలు ఇవ్వడం వివాదాస్పదమైంది.
తాను టెండర్ ద్వారా పొందిన 49 కోడెలను ఇప్పటికే రాంబాబు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయమై మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు మండిపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెల కేటాయింపుపై విచారణ జరపాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: అది నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానం
Comments
Please login to add a commentAdd a comment