vemulavada temple
-
హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు!
సాక్షి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, వాటి పరిసరాల్లో వివాహాలు చేసుకోకూడదన్న నిబంధనను ధిక్కరించి మరీ వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హిజ్రా పింకి, హైదరాబాద్‌కు చెందిన యువకుడు శ్రీనివాస్ ఒకరినొకరు ఇష్టపడి శనివారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లుగా కలిసే ఉంటున్న వీరి పెళ్లికి ఇరువురు పెద్దలూ అంగీకరించడంతోనే ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, అమావాస్య పేరుతో అధికారులెవరూ విధులకు హాజరుకాకపోవడం కూడా ఈ జంటకు కలిసొచ్చింది. చదవండి: బస్సులోనే చనిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని అదే బస్సులో ఇంటికి చేర్చిన సిబ్బంది -
వేములవాడలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
-
‘మహా’ జాతర.. ఆరుసార్లు బ్రేక్‌తో అవస్థలు
వేములవాడ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమాన్ని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 3లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకుని తరించారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. జాతర సందర్భంగా ఆర్జీత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్థరాత్రి వరకు ఆలయాన్ని తెరచే ఉంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ విశ్వజీత్, ఈవో దూస రాజేశ్వర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లాల్ అధికారులు పర్యవేక్షించారు. ఆరుసార్లు బ్రేక్‌తో అవస్థలు మహాశివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు అవస్థలు తప్పలేదు. మంగళవారం ఐదుసార్లు విధించిన బ్రేక్ వల్ల భక్తులు అసహనం కోల్పోయారు. దీనికితోడుగా అర్థరాత్రి నుంచి స్థానికుల దర్శనాలు, కౌన్సిలర్ల దర్శనాలు, టీడీపీ పట్టువస్త్రాల సమర్పణ, ప్రభుత్వ పక్షాన పట్టువస్త్రాల సమర్పణ, శివస్వాముల దర్శనాలు, స్థానిక బ్రాహ్మణోత్సముల మహాలింగార్చన, లింగోద్భవ సమయంలో ఇలా ఆరుసార్లు బ్రేక్ ఇవ్వడం వల్ల భక్తులంతా క్యూలైన్లలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. పోలీసులు జారీ చేసిన పాస్‌లపై వివాదం నెలకొంది. పాస్‌లు జారీ చేసిన పోలీసులు వాటిని అనుమతించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు సోమవారం రాత్రి 12 గంటల నుంచి 3.30 గంటల వరకు స్థానికుల దర్శనాల అనంతరం గర్భగుడి దర్శనాలు నిలిపివేశారు. స్వామివారి దర్శనానికి ఆరుగంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో నిలబడిన ముగ్గురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆరోగ్య సిబ్బంది అక్కడి కి చేరుకుని చికిత్స చేశారు. భక్తులు ధర్మగుండంలో స్నా నా లు చేసి కోడె మొక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు. పట్టువస్త్రాల సమర్పణ... స్వామి వారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, కలెక్టర్ కృష్ణభాస్కర్ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవ స్థానం పక్షాన జేఈవో శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో టీటీడీ అర్చకుల బృందం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి వారికి సుమారు రూ. కోటిన్నర ఆదాయం సమకూరనున్నట్లు ఆలయ వర్గాలు భావిస్తున్నాయి. వైభవంగా సామూహిక ‘మహాలింగార్చన’ వేములవాడ: మహాశివరాత్రి సందర్భంగా సామూహిక మహాలింగార్చన కార్యక్రమం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది.స్వామి వారి కల్యాణ మండపంలో స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య నేతృత్వంలో అర్చక బృందం మహాలింగార్చనను రెండు గంటల పాటు నిర్వహించారు. మట్టితో చేసిన 366 మృత్తికలు, పిండితో చేసిన 366 జ్యోతులను లింగాకారంలో పేర్చి స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనువంశిక అర్చక కుటుంబాలు పాల్గొన్నాయి. -
కొంగు బంగారం... మత్మ్యాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మత్మ్యాద్రి ఆలయం (వేములకొండ గుట్ట) భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నాలుగు కొండల మధ్యనున్న గుట్ట మీద బండరాయిపై స్వయంభూగా వెలిశాడు లక్ష్మీనరసింహస్వామి. మత్సా్వవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుండడంతో మత్స్యగిరి ఆలయంగా పేరొందింది. కొలిచిన వారికి కొండంత అండగా, భక్తుల కొంగు బంగారంగా పేరొందిన ఆలయ బ్రహ్మోత్సవాలు గత నెల 30న ఆరంభమైనాయి. ఈ నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. క్షేత్ర ప్రాశస్త్యం వలిగొండ మండల కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది మత్సా్యద్రి ఆలయం. మొదట్లో ఆలయాన్ని వేములకొండ గుట్టగా పిలిచేవారు. మత్స్యగిరిగుట్ట సమీపంలోని పొట్టిగుట్టపై చూస్తే స్వామి వారు వెలిసిన గుట్ట చేప రూపంలో దర్శనం ఇవ్వడం, గుట్ట మీదకు వెళ్తుంటే సగ భాగం వద్ద శిలద్వారానికి చేప శిల్పం చెక్కి ఉండడంతో మత్స్యగిరిగుట్టకు ఆ పేరొచ్చింది. కాగా నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం పేర్లు కలిగిన మూడు గుండాల కలయికతో కొలను ఏర్పడింది. కొలనులో నీరు ఏ కాలంలోనైనా అదే స్థాయిలో ఉండటం, కొలనులోని చేపలన్నీ ఒకే పరిమాణంలో ఉండటం, గర్భగుడి ముందుండే కొలనులోని చేపలు నామాలు కలిగి ఉండడం ఆలయ ప్రత్యేకత. స్వామివారు మత్స్య రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ఖ్యాతికెక్కింది. మహిమాన్వితమైన తీర్థజలం స్వామి వారి ఆలయం ముందున్న కొలనులోని నీటిని పంట చేలలో చల్లుకుంటే పంటలను ఆశిస్తున్న చీడపీడలు దూరమై దిగుబడి పెరుగుతుందని నమ్మకం. వ్యాపార సంస్థలలో ఆ నీటిని చల్లితే వ్యాపారాలు అభివృద్ధిలో నడుస్తాయని ప్రతీతి. అందుకే భక్తులు కొలనులోని నీటిని తీసుకెళ్తారు. ఇక అనారోగ్యం పాలైన వారు స్వామివారి ఆలయ సన్నిధిలో నిద్ర చేస్తే స్వామివారు కలలోకి వచ్చి ఆయా రుగ్మతలను నయం చేస్తారని నమ్మకం. దీంతో భక్తులు గుట్టపై నిద్ర చేస్తారు. గుట్టపైకి మూడు ఘాట్ రోడ్లు స్వామివారిని దర్శించుకోవడానికి గుట్టపైకి అప్పట్లో నడిచి వెళ్లేవారు. వేములకొండకు చెందిన ఒక భక్తుడు సొంత నిధులతో గుట్ట మీదికి తారు రోడ్డు, సీసీ రోడ్డు వేయించాడు. వలిగొండ, మోత్కూరు రోడ్డులో ఆరూరు పరిధిలో వెంచర్ చేసిన సంస్థ గుట్టపైకి వెళ్లడానికి మరో ఘాట్‌రోడ్డు నిర్మించింది. రెండు వైపులా ఘాట్‌రోడ్లు ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు మార్గం వైపు నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో మెట్ల మార్గం వైపు ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ వ్యాపారులతోపాటు మరికొందరు దాతల సహకారంతో మెట్ల మార్గం పక్కనుంచి మరో ఘాట్‌రోడ్ నిర్మించారు. ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయు స్వామి కావడంతో స్వామి వారి దర్శనానంతరం భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఇతర దర్శనీయ స్థలాలు వలిగొండ పట్టణంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే ఆలయంలో కొలువైన ఇష్టకామేశ్వరస్వామి త్రిశక్తి ఆలయం ఉంది. ఈ ఆలయ సముదాయంలో 9 ఆలయాలు ఉన్నాయి. సంగెం వద్ద భీమలింగం కత్వ వద్ద భారీ శివలింగం ఉంటుంది. దీనిని భీముడు ప్రతిష్టించడంతో భీమలింగంగా పేరొందిందని ప్రతీతి. అలాగే సుంకిశాలలో యాదాద్రి దత్తత ఆలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం ఉంది. – వాసా శ్రీధర్, సాక్షి, వలిగొండ నైవేద్యం ఆరగించడానికి వస్తున్న చేప -
రాజన్నకు వైభోగమే!
♦ సీఎం రాకతో ఎములాడకు మహర్దశ ♦ రాబోయే కేబినెట్లోనే అంకురార్పణ ♦ రూ.500 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక ♦ మరో ఐదేళ్లలో రూపురేఖలే మారే అవకాశం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటనతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి బీజాలు పడ్డాయి. ఏటా రూ.100 కోట్ల చొప్పున రాబోయే నాలుగైదేళ్ల వరకు నిధులు కేటాయిస్తామని సీఎం ప్రకటించడంతో రాజన్న భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాబోయే ఐదేళ్లలో ఎములాడ రూపురేఖలు మారేలా చేస్తానని ముఖ్యమంత్రే ప్రకటించడంతో ఇక ఎములాడ రాజన్న దేవాలయానికి మహర్దశ పట్టడం ఖాయమన్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే సూచనలతో దేవాలయ అధికారులు రూ.250 కోట్లకే ప్రతిపాదనలు రూపొందించారు. సీఎం ఆ మేరకు నిధులు కేటాయిస్తే చాలు. దేవాలయ పరిసర ప్రాంతాలను అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చనే భావనలో ఉన్నారు. కానీ, వారు ప్రతిపాదించిన దానికంటే రెట్టింపు నిధులు కేటాయించేందుకు సీఎం సిద్ధమవ డం... అందులో భాగంగా అక్కడికక్కడే రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించడం.. దీనికితోడు రాబోయే నాలుగైదేళ్ల పాటు ఏటా రూ.100 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో రాజన్న ఆలయ అధికారుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే జిల్లా ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు చప్పట్ల తో సంతోషాన్ని వ్యక్త పరిచారు. మీడియా సమావేశం ముగిసిన తరువాత ఆలయ ఈవో సహా అధికారులంతా సీఎంతోపాటు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ముందు 2, 3 ఎకరాల విశాల స్థలం ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఆలయ ప్రాంగణ ంలో లక్షలాది మంది భక్తులుండేలా తీర్చిదిద్దుతామని, హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ తరహాలో వేములవాడ చెరువును అభివృద్ధి చేస్తామని, నాంపల్లి గుట్టను పర్యాటక కేంద్రంగా మారుస్తామని, అక్కడి నుంచి రాజన్న దేవాలయం వరకు రోడ్లు విస్తరిస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో... రాబోయే ఐదేళ్లలో ఊహించలేనంతగా వేములవాడ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి రాజన్న దేవాలయానికి వచ్చి వెళితే చాలు... అని జిల్లా ప్రజలంతా భావిస్తున్న తరుణంలో... ఏకంగా రోజంతా జిల్లాలోనే మకాం వేసి రాజన్న సన్నిధిలోనే 6 గంటలకుపైగా సమయాన్ని వెచ్చించి... కాలినడక బయలుదేరి చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశీలించడంతో పేదల దేవుడిగా కొలిచే రాజన్నకు రాబోయే రోజుల్లో ఇక వైభోగం తప్పదని భావిస్తున్నారు. ఏటా వంద కోట్లు కేటాయిస్తామనే సీఎం వ్యాఖ్యలు ఆచరణ సాధ్యమా? కాదా? అనే విషయాన్ని పక్కనపెడితే... కనీసం రూ.300 కోట్లు కేటాయిస్తే చాలనని... కనీవినీ ఎరగని రీతిలో ఎములాడ రాజన్న దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని, గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా అధికారులు చెబుతున్నారు. నాంపల్లి గుట్టను సందర్శించిన మొట్టమొదటి సీఎం రాజన్న ఆలయూనికి అనుబంధంగా ఉన్న నాంపల్లి గుట్టను ఓ ముఖ్యమంత్రి స్థారుు వ్యక్తి సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అధికారులతో సమీక్షలో నాంపల్లి గుట్ట గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాంపల్లి గుట్ట నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్లను వెడల్పు చేస్తామని, వెళ్లడానికి, రావడానికి చెరో రోడ్డు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుట్టపై ఉన్న 125 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. విస్తరణకు అవకాశం మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయూనికి వెళ్లే దారి ఇరుకుగా ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్ రోడ్డు విస్తరణ కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘విస్తరణలో ఆస్తి కోల్పోయే వారికి ఎంత నష్టం వస్తుందో... అంతకంటే ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆలయ అభివృద్ధి కోసం అందరూ సహకరిం చాలి. త్వరలోనే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులంతా సమావేశమై తగిన నిర్ణయం తీసుకోవాలి. స్థానికులు కూడా సహకరించాలి. బైపాస్ రోడ్ల కోసం రూ.60 కోట్లు విడుదల చేశాం. సత్వరమే పను లు చేపట్టాలి. ఆలయ విస్తరణలో భాగంగా చెరువు సమీపంలోని మరో 25 నుంచి 30 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తాం. వారికి అంతకుమించి స్థలాన్ని వేరే చోట ఇస్తాం. సిరిసిల్ల నుంచి వేములవాడకు నాలుగు లైన్ల రహదారి పనులు నడుస్తున్నారుు. వాటిని వెంటనే పూర్తి చేస్తాం. వేములవాడలోనే సంస్కృత, వేద పాఠశాల ఉండాలి. శృంగేరి పీఠం ఆధ్వర్యంలో ఇక్కడ ఆయా పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. సంకెపల్లి వద్ద చెక్‌డ్యాం కట్టి మధ్యమానేరు బ్యాక్‌వాటర్ నిల్వ చేస్తే 365 రోజులపాటు నీటికి కొరత ఉండదు’ అని వేములవాడకు సీఎం వరాలు ప్రకటించారు. చెరువు అభివృద్ధి గుడిచెరువును అందంగా తీర్చిదిద్దుతామనీ సీఎం తెలిపారు. మూడున్నర కిలోమీటర్ల మేర రింగ్‌బండ్ లాగా తీర్చిదిద్దుతామని, మట్టి తీసి నీటిని నిల్వ చేసి బోటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. లక్షలాది మంది వచ్చినా స్థలం ఉండేలా చెరువు ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పుష్కరిణి కూడా భక్తులకు సరిపడేలా లేదని, విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ పనులన్నీ రాబోయే 2 నుంచి 5 ఏళ్లలోపే పూర్తి చేస్తామని చెప్పడంతో నాలుగేళ్లలో రాజన్న ఆలయం మరింత అభివృద్ధి చెందే అవకాశమేర్పడింది. మంత్రులు లేకుండానే పర్యటన సీఎం వేములవాడ పర్యటన దేవాదాయశాఖ మంత్రి, కనీసం జిల్లా మంత్రులు లేకుండానే పర్యటన సాగడం గమనార్హం. -
కల్యాణవైభోగం
వేములవాడ అర్బన్ : వేములవాడ దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష మందికి పైగా భక్తుల సమక్షంలో వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ఆదివారం ఉదయం 10.20 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా నగర పంచాయతీ పక్షాన చైర్పర్సన్ నామాల ఉమ-లక్ష్మీరాజం, కౌన్సిలర్లు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున ప్రజాప్రతినిధులు, నగరపంచాయతీ పాలకవర్గం, వధువు పక్షాన ఈవో రాజేశ్వర్, రెనోవేషన్ కమిటీ సభ్యులు, అధికారులు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. స్వామి వారికి రూ.101 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రూ.101 కోట్లతో పార్వతీ అమ్మవారికి నగలు చేరుుస్తామని వరుడి తాలూకు పెద్ద మనుషులు ప్రకటించడంతో అందరూ నవ్వుకున్నారు. అంతకుముందు ఉదయం 6 గంటలకు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవ తార్చనలు, అభిషేకములు, ధ్వజారోహణము, ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో మొత్తం రెండున్నర గంటలపాటు కల్యాణవేడుక జరిగింది. సాయంత్రం పురాణ ప్రవచనము, ప్రధాన హోమము సప్తపది, లాజాహోమము, ఔపాసనము, బలిహరణ కార్యక్రమాల అనంతరం రాత్రి పెద్దసేవపై ఊరేగించారు. భక్తుల ఇబ్బందులు కల్యాణోత్సవానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యూరు. వేడుక ఆలయంలో జరగడంతో చాలా మంది భక్తులు ఆలయం బయటే ఉండిపోయూరు. వేడిమి తట్టుకోలేక అనేక మంది భక్తులు సృ్పహతప్పి పడిపోయూరు. తాగునీటికి అల్లాడిపోయూరు. ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కల్యాణ మంటపంలోకి వీఐపీలను అనుమతించకుండా రెండు స్టేజీలు ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవాన్ని స్థానిక సీటీ కేబుల్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమాలక్ష్మిరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, డీఎస్పీ దామెర నర్సయ్య, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, సీఐ తుంగ రమేశ్‌బాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కన్యాదాతలుగా ప్రతాప శ్రీనివాస్- రాజకుమారి దంపతులు, వ్యాఖ్యాతగా నమిలకొండ హరిప్రసాద్, చంద్రగిరి శరత్ వ్యవహరించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామి వారికి రూ.72 వేల కట్నాలు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు శివ కల్యాణోత్సవాల్లో భాగంగా మూడోరోజు సోమవారం ఉదయం 6 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకములు, పారాయణములు, 7.05 గంటల నుంచి ఔపాసనము, బలహరణము, అవాహితదేవతాహోమము, సాయంత్రం 4 గంటల నుంచి శివ పురాణప్రవచనములు, 6 గంటలకు ఔపాసనము, బలిహరణము, రాత్రి 8.15 గంటల నుంచి సదస్యము కార్యక్రమాలుంటారుు. మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.