కల్యాణవైభోగం | Swami Vari kalyanam | Sakshi
Sakshi News home page

కల్యాణవైభోగం

Published Mon, Mar 9 2015 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

Swami Vari  kalyanam

వేములవాడ అర్బన్ : వేములవాడ దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష మందికి పైగా భక్తుల సమక్షంలో వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య ఆదివారం ఉదయం 10.20 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా నగర పంచాయతీ పక్షాన చైర్‌పర్సన్ నామాల ఉమ-లక్ష్మీరాజం, కౌన్సిలర్లు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
 
 ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున ప్రజాప్రతినిధులు, నగరపంచాయతీ పాలకవర్గం, వధువు పక్షాన ఈవో రాజేశ్వర్, రెనోవేషన్ కమిటీ సభ్యులు, అధికారులు కట్నకానుకలు మాట్లాడుకున్నారు. స్వామి వారికి రూ.101 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రూ.101 కోట్లతో పార్వతీ అమ్మవారికి నగలు చేరుుస్తామని వరుడి తాలూకు పెద్ద మనుషులు ప్రకటించడంతో అందరూ నవ్వుకున్నారు. అంతకుముందు ఉదయం 6 గంటలకు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవ తార్చనలు, అభిషేకములు, ధ్వజారోహణము, ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో మొత్తం రెండున్నర గంటలపాటు కల్యాణవేడుక జరిగింది. సాయంత్రం పురాణ ప్రవచనము, ప్రధాన హోమము సప్తపది, లాజాహోమము, ఔపాసనము, బలిహరణ కార్యక్రమాల అనంతరం రాత్రి పెద్దసేవపై ఊరేగించారు.
 
 భక్తుల ఇబ్బందులు
 కల్యాణోత్సవానికి లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యూరు. వేడుక ఆలయంలో జరగడంతో చాలా మంది భక్తులు ఆలయం బయటే ఉండిపోయూరు. వేడిమి తట్టుకోలేక అనేక మంది భక్తులు సృ్పహతప్పి పడిపోయూరు. తాగునీటికి అల్లాడిపోయూరు. ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి కల్యాణ మంటపంలోకి వీఐపీలను అనుమతించకుండా రెండు స్టేజీలు ఏర్పాటు చేశారు.
 
  కల్యాణోత్సవాన్ని స్థానిక సీటీ కేబుల్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్ నామాల ఉమాలక్ష్మిరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, డీఎస్పీ దామెర నర్సయ్య, ఏఈవోలు ఉమారాణి, గౌరినాథ్, హరికిషన్, సీఐ తుంగ రమేశ్‌బాబు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కన్యాదాతలుగా ప్రతాప శ్రీనివాస్- రాజకుమారి దంపతులు, వ్యాఖ్యాతగా నమిలకొండ హరిప్రసాద్, చంద్రగిరి శరత్ వ్యవహరించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామి వారికి రూ.72 వేల కట్నాలు చెల్లించుకున్నారు.
 
 బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు
 శివ కల్యాణోత్సవాల్లో భాగంగా మూడోరోజు సోమవారం ఉదయం 6 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకములు, పారాయణములు, 7.05 గంటల నుంచి ఔపాసనము, బలహరణము, అవాహితదేవతాహోమము, సాయంత్రం 4 గంటల నుంచి శివ పురాణప్రవచనములు, 6 గంటలకు ఔపాసనము, బలిహరణము, రాత్రి 8.15 గంటల నుంచి సదస్యము కార్యక్రమాలుంటారుు. మంగళవారం మధ్యాహ్నం 3.35 గంటలకు రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement