తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
► పోస్టులు: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు
► మొత్తం పోస్టుల సంఖ్య: 172
► అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.స్పోర్ట్స్ కోటా అర్హత సాధించి ఉండాలి.
► వయసు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► జీత భత్యాలు: నెలకు రూ.28,719 వేతనం అందిస్తారు.
► ఎంపిక విధానం: రాత పరీక్షతోపాటు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018,రూరల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.ప్రతి పేపర్‌లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది. (ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!)
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021
► వెబ్‌సైట్: https://epanchayat.telangana.gov.in/cs
Comments
Please login to add a commentAdd a comment