
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం రాష్ట్రంలో 61,573 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 865 మంది వైరస్ బారిన పడ్డారు. అంటే పాజిటివిటీ 1.40 శాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 7.80 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 2,484 మంది కోలుకోగా, మొత్తం 7.56 లక్షల మంది కోలుకున్నారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,103 మంది బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment